Magazines

కాంగ్రెస్ పాపం రాష్ట్రానికి కరువు

54 నిమిషాల క్రితం

Drought
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 02, 2026 | 2 నిమిషాల చదవడం


రైతుల ద్రోహి సీఎం రేవంత్ రెడ్డి

కృష్ణానదిని ఆంధ్రకు దారధత్యం

కరెంటు ఎప్పుడు వస్తుందో తెలువదు

కడ్తాల్ ను కరువు మండలంగా ప్రకటించాలంటూ ర్యాలీ

మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్

నవతెలంగాణ-కడ్తాల్

కాంగ్రెస్ పాపం వలన రాష్ట్రానికి కరువు ఏర్పడిందని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. సోమవారం మాజీ జడ్పీటీసీ సభ్యులు జర్పుల దశరథ్ నాయక్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కడ్తాల్ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలంటూ నాయకులతో కలిసి కడ్తాల్ చౌరస్తా నుండి తహసిల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు.కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.కరువు మండలంగా ప్రకటించాలంటూ డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కష్టాలను పట్టించుకోవడం లేదన్నారు.సీఎం రేవంత్ రెడ్డి కౌలు రైతులకు రూ .12ఇస్తామని చెప్పి ఇంతవరకు అతిగతి లేదన్నారు.బీఆర్ఎస్ ప్రభుత్వంలో పాలమూరు ఎత్తిపోతల కు 35వేల కోట్ల రూపాయలు మంజూరు చేశామని గుర్తు చేశారు.కాలువల నిర్మాణానికి పదివేల కోట్లతో కాలువలు తీశామన్నారు. 24గంటల కరెంటు ఇచ్చామన్నారు. 70లక్షల రైతులకు బీమా పథకం అమలు చేశామని గుర్తు చేశారు.

రైతు మరణిస్తే 5లక్షల రూపాయలు బీమా పథకం ద్వారా రైతు కుటుంబానికి వచ్చేవని తెలిపారు.కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు బీమా పథకానికి ఎల్ఐసి కూడా కట్టలేదని ఎద్దేవా చేశారు.కాలువల నిర్మాణానికి ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదని విమర్శించారు.రైతులకు రైతుబంధు కింద మూడుసార్లు రైతుబంధు ఇవ్వకుండా పంగనామాలు పెట్టారన్నారు.రైతులకు రూ. 13వేల కోట్ల రూపాయలు బాకీ పడిందన్నారు.ఇంతవరకు రైతులకు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయలేదన్నారు.కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది అన్నారు.క్వింటాలకు రూ. 5వందలు బోనస్ ఇస్తామని ఇవ్వడం లేదన్నారు.రాష్ట్రంలో కాలువల కోసం తట్ట మట్టి కూడా తీయలేదన్నారు.సూపర్ ఎల్ నివో వచ్చింది ఏ విధంగా వలస విధానం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నిందన్నారు.సీఎం రేవంత్ రెడ్డి అత్తగారి ఊరికి మోసం చేశాడు,అమ్మ గారి ఊరికి మోసం చేశాడన్నారు. 35వేల టీఎంసీ నీళ్లు కూడా వదలలేదని తెలిపారు. 100ఫీట్ల గొయ్యి తీసి రేవంత్ రెడ్డిని పాతిపెట్టాలన్నారు.కాంగ్రెస్ పార్టీ కుంభకోణాల పార్టీ అని దుయ్యబట్టారు.సీఎం సోదరులు అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపించారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా రైతులను నిలువున ముంచారన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతుల పట్ల చిత్తశుద్ధి లేదన్నారు.వెంటనే ప్రభుత్వం స్పందించి కడ్తాల్ ను కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.లేనియెడల పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.అనంతరం తహసిల్దార్ జయశ్రీ కి వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ ఆనంద్ కుమార్,బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు రామకృష్ణ,మాజీ ఏఎంసి డైరెక్టర్ లయక్ ఆలీ,సర్పంచులు రామచందర్ నాయక్,గోపాల్,సీనియర్ నాయకులు జోగయ్య,వార్డు సభ్యులు గణేష్ గౌడ్,యూత్ వింగ్ నాయకులు మహేష్ (హెచ్ఆర్),టియుఎఫ్ నాయకులు,బీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్