- వాల్మీకి ఆలయ అభివృద్ధికి ఎమ్మెల్యే రూ.2 వేల విరాళం
నవతెలంగాణ - అశ్వారావుపేట
మున్సిపాలిటీ పరిధిలోని తూర్పు బజారులో కొలువుదీరిన వాల్మీకి బోయ ఆలయంలో సోమవారం వాల్మీకి జయంతి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాలుగో వార్డు కౌన్సిలర్ కట్టా సింధుజ వాల్మీకి జెండాను ఆవిష్కరించారు.అనంతరం కాంగ్రెస్ నాయకులు జూపల్లి ప్రమోద్ వాల్మీకి విగ్రహానికి పూలమాల వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వాల్మీకి మహర్షి భక్తికి, గొప్పతనానికి ప్రతీక అని, అటువంటి మహనీయులను స్మరించుకోవడం అదృష్టమని వారు పేర్కొన్నారు.
ఆలయ అభివృద్ధికి ఎమ్మెల్యే విరాళం
వాల్మీకి జయంతిని పురస్కరించుకొని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పట్టణంలోని వాల్మీకి బోయ ఆలయ అభివృద్ధికి రూ.2 వేల నగదును విరాళంగా అందజేశారు. ఈ మొత్తాన్ని కౌన్సిలర్ కట్టా సింధుజ, కాంగ్రెస్ నాయకుడు జూపల్లి ప్రమోద్ ఆలయ కమిటీ సభ్యులకు అందించారు. ఆలయ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నండ్రు రమేష్, మోర్ల వెంకన్న, వాల్మీకి బోయ సంఘం సభ్యులు ముసికి వెంకటరమణ, నల్లబోతుల నాగరాజు, గుజ్జుల ఆనంద్, మహాలక్ష్మి, బొగ్గు లక్ష్మి, నల్లబోతుల సీతాకుమార్, నల్లబోతుల నాగు, పెనుసుల అంజి, గుజ్జుల కృష్ణకుమారి, నల్లబోతుల సాంబ తదితరులు పాల్గొన్నారు.






కామెంట్లు (0)