Magazines

మణిపూర్‌‌లో కొనసాగుతున్న ఉద్రిక్తలు

1 గంట క్రితం

Manipur
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 22, 2026 | 2 నిమిషాల చదవడం

కుకి వ్యక్తి కాల్చివేత

అనేక ఇళ్లకు నిప్పు

సంపూర్ణ రాష్ర్టబంద్‌


‌ఇంఫాల్‌ : మణిపూర్‌‌లో మూడేళ్లకు పైగా కొనసాగుతున్న హింసాకాండాకు ఇప్పట్లో ముగింపు కనిపించడం లేదు. ఉద్రిక్తలు కొనసాగుతూనే ఉన్నాయి. మంగళవారం మణిపూర్‌లోని కాంగ్‌పోక్పి జిల్లాలో ఒక అటవీ ప్రాంతం సమీపంలో 45 ఏళ్ల కుకీ వ్యక్తిని గుర్తు తెలియని సాయుధులు కాల్చి చంపారు. లీమాఖోంగ్ పోలీస్ స్టేషన్‌కు సుమారు 13 కిలోమీటర్ల దూరంలో మంగళవారం ఉదయం 5:30 గంటల సమయంలో ఈ ఘటన జరిగిం ది. అటవీ ప్రాంతం నుంచి వెదురు చిగుళ్ళు సేకరించడానికి పి మోల్డింగ్ గ్రామానికి చెందిన పావోలెన్ ఖోంగ్‌సాయి, లాల్‌డెంగా అనే కుకీ వ్యక్తులు వెళ్లగా, వారిపై ఒక్కసారిగా కాల్పులు జరిగాయి. గాయాలతో ఖోంగ్‌సాయి అక్కడికక్కడే మృతి చెందగా, లాల్‌డెంగా ఎలాంటి గాయాలు లేకుండా తప్పించు కున్నాడు. ఈ ఘటన తరువాత అంటే బుధ వారం ఉదయం కామ్‌జోంగ్ జిల్లాలో ఖోయికై అనే కుకీ గ్రామంలో అనేక ఇళ్లకు నిప్పు పెట్టి దగ్ధం చేశారు. బుధవారం ఉదయం 5.30 గంటల సమయంలోనే ఈ ఘటన జరగడం గమనార్హం. అయితే ఈ గ్రామంలో ప్రస్తుతం ఎవ్వరూ నివాసం ఉండటం లేదు. గతంలో జరిగిన హింసాకాండ కారణంగా గ్రామం నుంచి నివాసితులు అంతా పునరావాస కేంద్రా లకు తరలివెళ్లిపోయారు. ఇళ్లకు నిప్పు పెట్ట డంతో జరిగిన నష్టంపైనా ఇంకా అంచనాకు రాలేదని పోలీసులు తెలిపారు. అలాగే, ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.

కాగా, ఇంఫాల్ ఈస్ట్‌ జిల్లాలో సోమవారం నాడు అడవిలో వంటచెరుకు సేకరించడానికి వెళ్లిన ముగ్గుర్ని కాల్చి చంపిన సంగతి తెలిసిందే. దీంతో ఆగ్రహించిన స్థానికులు రెండు మృతదేహాలను ముఖ్యమంత్రి ఖేమ్‌చంద్ సింగ్ నివాసం ముందుకు తీసుకెళ్లి ఆందోళనకు దిగారు. రాష్ర్టంలో ఉద్రిక్తలకు వ్యతిరేకంగా నేటివ్ పీపుల్స్ కమిటీ ఆఫ్‌ ‌మణిపూర్‌ (ఎన్‌‌పిసిఎం) మంగళవారం అర్ధరాత్రి నుంచి 48 గంటల సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చింది. అలాగే, కాంగ్‌పోక్పి గిరిజన ఐక్యతా కమిటీ మంగళవారం అర్ధరాత్రి నుంచి 24 గంటల సంపూర్ణ బంద్‌ను ప్రకటించింది. దీంతో మణిపూర్‌‌లో బుధవారం జనజీవితం స్థంభించింది. రద్దీగా ఉండే అనేక ప్రాంతాలు నిర్మానుష్మంగా మారాయి.

బిజెపి ప్రభుత్వ అసమర్థతతోనే హింసాకాండ : కాంగ్రెస్‌

బిజెపి ప్రభుత్వ అసమర్థత, వైఫల్యంతోనే మణిపూర్‌‌లో హింసాకాండ కొనసాగుతోందని కాంగ్రెస్‌ ‌బుధవారం విమర్శించింది. శాంతిభద్రతలు, రాజ్యాంగ హక్కులు పరిరక్షించడంలో మణిపూర్‌ ప్రభుత్వం విఫలం చెందిందని కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు. ఈ మేరకు ఎక్స్‌‌లో ఒక పోస్టు చేశారు. ఇంకా ఎంతమంది ప్రాణాలు కొల్పోయి తరువాత ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుటుందని ప్రశ్నించారు. 2023 మే నుంచి ఇప్పటీకి దాదాపు 24 వేల మంది దయనీయమైన పరిస్థితుల్లో సహాయ శిబిరాల్లో జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. "రాష్ట్రపతి పాలన విధించడం, ముఖ్యమంత్రిని మార్చి తమ ప్రభుత్వాన్ని మళీ ఏర్పాటు చేసుకోవడం వంటి బిజెపి అనుసరించిన రాజకీయ కుతంత్రాలతో ఏమాత్రం శాంతి చేకూరలేదు. హింసకాండ చెలరేగి 29 నెలల దాటినా మణిపూర్‌లో అడుగుపెట్టని ప్రధాని మోడీ, పార్లమెంటులో ఇచ్చిన హామీ విషయంలో ఘోరంగా విఫలమయ్యారు" అని ఖర్గే తన పోస్టులో విమర్శించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్