Magazines

సర్‌ ‌పై ఇండియా బ్లాక్‌ పిటిషన్‌ విచారణకు సుప్రీం ఓకే

1 గంట క్రితం

Supreme Court agrees to hear INDIA bloc's petition
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 18, 2026 | 1 నిమిషాల చదవడం

​త‌దుప‌రి విచార‌ణ‌ డిసెంబర్‌ 9కి వాయిదా

​నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

న్యూఢిల్లీ : సర్‌ ‌ప్రక్రియపై లోక్‌సభలో ప్రతిపక్ష‍ నేత రాహుల్‌ గాంధీ సహా ఇండియా బ్లాక్‌ నేతలు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు మంగళవారం అంగీకరించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును డిసెంబర్‌9కి వాయిదా వేసింది. వాస్తవానికి ఈ పిటిషన్‌ మంగళవారం విచారణకు రావాల్సి వుంది. అయితే, మధ్యాహ్న భోజన విరామం కోసం ధర్మాసనం వెళ్లాల్సి ఉండటంతో, భారత ఎన్నికల సంఘం (ఇసీఐ) తరపున హాజరైన సీనియర్‌ న్యాయవాది హరీష్‌ సాల్వే, అన్ని పిటిషన్లను విచారించడానికి తగినంత సమయం ఉంటుందా అని ప్రశ్నించారు. మధ్యాహ్నం వేళ ఇప్పటికే ఒక ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేయబడి ఉందని, దీంతో విచారణను మరో తేదీకి వాయిదా వేయాలని ధర్మాసనాన్ని కోరారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) నిర్ణయాల ప్రక్రియపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని 48 ప్రశ్నలు అడిగేందుకు అనుమతించాలని కోరుతూ వారు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ‘సర్వీస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎస్‌ఐఆర్‌)’ నిర్వహణకు సంబంధించి, ఎన్నికల సంఘం అక్టోబర్ 26న దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొన్న అంశాల వాస్తవికతపై ఈ ప్రశ్నలు ఉన్నాయి. సుమారు 13 కోట్ల మంది ఓటర్లను తొలగించిన సర్‌ ప్రక్రియ ఇ‌సీఐ ఏకగ్రీవ నిర్ణయమని ఆ అఫిడవిట్‌లో పునరుద్ఘాటించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్