Magazines

టపాసులు వద్దు.. ప్రచారానికి కోహ్లీని రంగంలోకి దించండి: సుప్రీంకోర్టు

4 గంటల క్రితం

No fireworks, bring Kohli to campaign: Supreme Court
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 30, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : దీపావళి నేపథ్యంలో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో టపాసుల విక్రయాలు, వినియోగంపై కొనసాగుతున్న ఆంక్షలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సంపూర్ణ నిషేధం కంటే నిబంధనలను కఠినంగా అమలు చేయడంపై దృష్టి పెట్టాలని సూచించింది. ఆంక్షలను కొనసాగించాలా? సడలించాలా? అనే అంశంపై తీర్పును రిజర్వ్ చేసింది. గురువారం జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ ప్రసన్న బి. వరాఠేలతో కూడిన ధర్మాసనం పిటిషన్లను విచారించింది. కాలుష్య నియంత్రణకు ఏటా ఆదేశాలు జారీ చేస్తున్నా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది.


గాలి కాలుష్యంపై ప్రజల్లో, ముఖ్యంగా యువతలో అవగాహన కల్పించేందుకు క్రికెటర్ విరాట్ కోహ్లీ వంటి ప్రముఖులతో ప్రచారం నిర్వహించాలని సూచించింది. టపాసుల వల్ల విడుదలయ్యే పీఎం2.5 రేణువులు, విష వాయువులు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. గ్రీన్ క్రాకర్స్ సైతం పూర్తిగా కాలుష్యరహితం కాదని తెలిపారు. మరోవైపు సంపూర్ణ నిషేధంతో అక్రమ విక్రయాలు పెరిగే ప్రమాదం ఉందని తయారీదారులు వాదించారు. కాలుష్య నియంత్రణ చర్యల అమలుపై ఢిల్లీ ప్రభుత్వం, సీఏక్యూఎంను ధర్మాసనం ప్రశ్నించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్