విడుదల చేసిన ఘటనలో అటవీ శాఖ కేసు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దసరా వేడుకల్లో భాగంగా మంగళవారం రాత్రి హైదరాబాద్ ఉప్పల్ మినీ స్టేడియంలో పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వారు చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఉప్పల్‌కు చెందిన ఈగ చంద్రశేఖర్, పి. పరమేశ్వర్‌రెడ్డి, మరికొందరి ప్రమేయం ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించినట్టు మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లా అటవీ అధికారి వేణుమాధవ్ తెలిపారు. దీంతో వన్యప్రాణి సంరక్షణ చట్టం–1972లోని సంబంధిత సెక్షన్లతో పాటు బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 35 కింద అక్టోబర్ 21న పీఓఆర్ నెంబర్ 16-03/2025-26తో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ కొనసాగుతున్నదనీ, సంబం ధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేసినట్టు అధికారులు తెలిపారు. విచారణ పూర్తయిన తర్వాత చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటా మని చెప్పారు. నిందితులను సంబంధిత మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరుస్తామన్నారు.







కామెంట్‌లు (0)