మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నుంచి వస్తున్న తాజా చిత్రం ‘దొంగ నా కొడుకు’. మౌళి తనూజ్ ప్రశాంత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాతో శ్రీను కంబాల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమా నవంబర్ 13న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ టీజర్‌ను రిలీజ్ చేశారు. హీరో మౌళి మాట్లాడుతూ, ‘ఇది మంచి కథతో అందరినీ కడుపుబ్బా నవ్వించే క్రైమ్ కామెడీ సినిమా’ అని తెలిపారు. ‘ఈ టైటిల్ ఎవరికి చెప్పినా చాలా పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యేవారు. కానీ కొంతమంది మాత్రం నెగిటివ్‌గా చూస్తున్నారు. సినిమా చూసిన తర్వాత ఇది ఎందుకు పెట్టామో మీరే చెప్తారు. ఇది క్రైమ్ కామెడీ. ఫ్యామిలీ అందరూ వచ్చి ఎంజాయ్ చేసే సినిమా’ అని డైరెక్టర్ శ్రీను కంబాల చెప్పారు. నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ, ‘ఈ టైటిల్ ఇందులో మౌళి క్యారెక్టర్‌కు కరెక్ట్‌గా ఉంటుంది. సినిమా చాలా హిలేరియస్‌గా ఉంది. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. అలీ, రజిత, గుండు సుదర్శన్, రఘుబాబు.. ఇలా అందరూ అద్భుతంగా చేశారు. ‘లిటిల్ హార్ట్స్’ తర్వాత మౌళి సినిమా చూడటానికి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా చాలా పెద్ద విజయం సాధిస్తుందని అనుకుంటున్నాను’ అని అన్నారు.
అందరినీ కడుపుబ్బా నవ్వించే సినిమా
4 గంటల క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది అక్టో 21, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)