Magazines

రూ.కోటి బహుమతి

4 గంటల క్రితం

Rs 1 crore prize
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 21, 2026 | 2 నిమిషాల చదవడం

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ జంటగా నటిస్తున్న సై ఫై థ్రిల్లర్ ‘కిల్లర్’. ధ్యానం నాన్నఆశీస్సులతో థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్ పై పూర్వాజ్ , పద్మనాభ రెడ్డి.ఎ. నిర్మిస్తున్నారు. పూర్వాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 30న రిలీజ్ రాబోతోంది. ఓవర్సీస్ లో ఈ మూవీని ఓఎంజి పిక్చర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. బుధవారం ఈ చిత్ర ట్రైలర్ ను డైరెక్టర్ హరీశ్ శంకర్ రిలీజ్ చేశారు. నిర్మాత పద్మనాభరెడ్డి.ఎ మాట్లాడుతూ,‘ఈ సినిమా పూర్వజ్ క్రియేటివ్ టాలెంట్ ను నమ్మి సినిమా చేశాను. ఫస్ట్ కాపీ రెడీ అయ్యాక సినిమా చూశాను. మూవీ చూశాక చాలా హ్యాపీగా అనిపించింది’ అని అన్నారు. ‘ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని నమ్ముతున్నాం. ఈ కథ చాలా కొత్తగా ఉంటుంది. ఇంటర్నేషనల్ స్థాయి సై - ఫై ఫిక్షన్ తో, ఆ తరహా స్క్రీన్ ప్లేతో చేసిన చిత్రమిది’ అని హీరోయిన్ జ్యోతి పూర్వజ్ చెప్పారు. ప్రొడ్యూసర్, డైరెక్టర్ పూర్వాజ్ మాట్లాడుతూ,‘టీజర్ లో ఉన్న ట్విస్ట్ లను కొనసాగిస్తూ ట్రైలర్ చేశాం. టీజర్ లో నేను పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తా, ట్రైలర్ లో పోలీస్ ఆఫీసర్ తో పాటు సైంటిస్ట్ గా పరిచయమయ్యా. టీజర్ లాగే మా ట్రైలర్ కూడా చాలా ట్విస్ట్స్ లతో టర్న్స్ తో ఉంటుంది. మీకు అర్థమైనట్లే అనిపించినా డీప్ గా ఒక అందమైన కథ ఉంటుంది. అందులో నుంచి ఒక్క షాట్ కూడా మేము చూపించలేదు. ఈ సినిమాలో జ్యోతి ఎవరు అనే పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా కథలో జరుగు తుంటుంది. ఆ క్యారెక్టర్ లోని ట్విస్ట్ ఏంటనేది మీరు ఊహించలేరు. సెకండాఫ్ లో వచ్చే ఆ ట్విస్ట్ ను ఇంటర్వెల్ పడిన ఐదు నిమిషాల్లోపు ఊహించి మేము ఇచ్చే వాట్సాప్ నెంబర్ కు పంపిస్తే ఆ పర్సన్ కు మా మూవీ సక్సెస్ మీట్ రోజున కోటి రూపాయల బహుమతి అందిస్తాం’ అని తెలిపారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్