Magazines

కుటుంబ విలువలను చాటే సినిమా

1 గంట క్రితం

family values
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 29, 2026 | 1 నిమిషాల చదవడం

వెన్నెల సిల్వర్ స్క్రీన్ బ్యానర్ మీద దీపక్ నిర్మాణంలో శరత్ తెరకెక్కించిన చిత్రం ‘డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్’. రజత్ రాఘవ్, కాజల్, హాసిని సుధీర్ హీరో, హీరోయిన్లుగా, బేబీ పరిణిత రుద్రరాజు ముఖ్య పాత్రలో రూపొందించిన ఈ మూవీ టీజర్‌ను గురువారం రిలీజ్ చేశారు. ఈ టీజర్ లాంచ్‌కి రైటర్ విజయేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ‘పరిణితతో సినిమాని తీసేందుకే దర్శకుడు, నిర్మాత పుట్టారనిపిస్తోంది. పరిణితకు ఈ తెలుగు సినిమా చరిత్రలో ఓ పేజీ ఉండబోతోంది. శరత్ సినిమాని అద్భుతంగా తీసి ఉంటారని ఆశిస్తున్నాను. రజత్‌కి ఈ చిత్రంతో పేరు, డబ్బు అన్నీ వస్తాయని కాంక్షిస్తున్నాను. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. ‘రోలర్ కోస్టర్ రైడ్‌లా సినిమా ఉంటుంది.

కుటుంబ విలువల్ని చాటి చెప్పే చిత్రమిది. ప్రతీ ఫ్యామిలీకి కనెక్ట్ అవుతుంది’ అని హీరో రజత్ రాఘవ్ అన్నారు. దర్శకుడు శరత్ మాట్లాడుతూ,‘ప్రతీ ఒక్కరూ అద్భుతంగా నటించారు. సినిమా కూడా అద్భుతంగా వచ్చింది’ అని అన్నారు. నిర్మాత డి దీపక్ మాట్లాడుతూ,‘ఇది నాకు తొలి చిత్రం. సెట్‌లో ఎప్పుడూ పండుగ వాతావరణం కనిపించేది. మాకు సపోర్ట్ చేసేందుకు వచ్చిన విజయేంద్ర ప్రసాద్కి థాంక్స్. మా సినిమా నవంబర్ 27న రాబోతోంది’ అని తెలిపారు. హాసిని సుధీర్ మాట్లాడుతూ, ‘ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. డైరెక్టర్ ఎంతో వేగంగా సినిమాని పూర్తి చేశారు. అందరికీ నచ్చే సినిమా ఇది’ అని అన్నారు. ‘ఈ జర్నీలో అందరూ నాకు సపోర్ట్ చేశారు. సెట్‌లో మేమంతా సరదాగా ఉండేవాళ్లం. ఇది చాలా మంచి సినిమా’ అని బేబీ పరిణిత చెప్పారు. మాస్టర్ బన్నీ మాట్లాడుతూ, ‘పిల్లలకు పేరెంట్స్ మాత్రమే ఫస్ట్ ఫ్రెండ్స్ అని తెలిపే సినిమా ఇది’ అని అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్