ప్రొడ్యూసర్స్ బన్నీ వాస్, తబిత సుకుమార్ తమ బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై ప్రియదర్శి హీరోగా నిర్మిస్తున్న సినిమా ‘ఇడుపు కాయితం’. ఈ సినిమాలో ఫోక్ సాంగ్స్ ద్వారా పేరు తెచ్చుకున్న నటి నాగదుర్గ హీరోయిన్ గా నటిస్తోంది. దర్శకుడు వంశీరెడ్డి దొండపాటి రూపొందిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 11న రిలీజ్ కు రాబోతోంది. శనివారం ఈ సినిమా నుంచి 'గోగులు గోగులు..' లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి బ్యూటిఫుల్ ట్యూన్ తో 'గోగులు గోగులు..' సాంగ్ కంపోజ్ చేశారు. శ్రీలత (నాగదుర్గ), శ్రీనివాస్ (ప్రియదర్శి) వివాహ వేడుక నేపథ్యంలో ఈ పాట చిత్రీకరించారు. ఈ పాటకు కొంగరి కృష్ణ సాహిత్యాన్ని అందించగా, అభిక్య తనికెళ్ల, తరుణి, రచిత రాయ ప్రోలు, జయశ్రీ పల్లెం, స్నిగ్ధ శర్మ పాడారు. శివజ్యోతి (తీన్మార్ సావిత్రి), సుజాత (జోర్దార్), చంద్రవ్వ, మౌనిక రెడ్డి, రచ్చరవి, బిత్తిరి సత్తి, అభయ్ బేతిగంటి, మైమ్ మధు తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ - ఆశిష్ తేజ, ఎడిటర్ - శ్రీధర్ సొంపల్లి, డీవోపీ - ఎంఎన్ బాల్ రెడ్డి, మ్యూజిక్ - సురేష్ బొబ్బిలి, ప్రొడ్యూసర్ - బన్నీవాస్, తబిత సుకుమార్, స్క్రిప్ట్, డైరెక్షన్ - వంశీరెడ్డి దొండపాటి.







కామెంట్లు (0)