Magazines

మీ బాల్యాన్ని గుర్తు చేస్తుంది

48 నిమిషాల క్రితం

childhood
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 31, 2026 | 1 నిమిషాల చదవడం

ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మాత, పంపిణీదారుడు ధీరజ్ మొగిలినేని ‘సమ్మర్ హాలిడేస్’ అనే చిల్డ్రన్ మూవీని నిర్మిస్తున్నారు. శ్రీకర్ దర్శకుడు. మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబి ఖుషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈనెల 6న ఈ సినిమా రిలీజ్ కు వస్తోంది. ఈ సందర్భంగా శనివారం నిర్మాత ధీరజ్ మొగిలినేని మీడియాతో ముచ్చటించారు. ఈ కథ విన్నప్పుడు మనసును హత్తుకుంది. నా రియల్ లైఫ్, నా చైల్డ్ హుడ్ మెమొరీస్ గుర్తుకువ చ్చాయి. అమ్మమ్మ పాత్రలో జయసుధ చెప్పే డైలాగ్స్ మా అమ్మమ్మ చెప్పినట్లు, వాసుకి చెప్పే మాటలు మా అమ్మ చెప్పినట్లు అనిపించాయి. మా అమ్మ అలాగే నాతో మాట్లాడేది. నాతో పాటు ప్రేక్ష కులకు కూడా అదే ఫీల్ కలుగు తుందని నమ్మాను. ఈ కథలో చిన్నపిల్లల పాత్రలను టీనేజ్ లోకి మార్చి ఒక లవ్ స్టోరీ పెట్టి కమర్షియల్ గా మార్చవచ్చు.


కానీ బాల్యంలో ఉండే ఆ ఇన్నోసెన్స్ పోతుంది. పాత్రల్లోని ఆ సున్నితత్వమే ఈ కథలో కీలకమైంది. ఈ కథను చెబితే మళ్లీ పిల్లల సినిమాలు ఇండస్ట్రీలో నిర్మిస్తారని, ఆ చిత్రాలకు మా సినిమా స్ఫూర్తిగా నిలుస్తుందని నమ్మాం. ఒక స్పెషల్ అటెంప్ట్ చేసే చిత్రాలకు, కొత్త నిర్మాతలు తీసే చిన్న చిత్రాలకు, స్థానికంగా రూపొందించే సినిమాలకు ప్రభు త్వం నుంచి ఏదైనా రాయితీ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే థియే టర్స్ నుంచి రెవెన్యూ తగ్గి పోయింది. ఓటీటీలు పెద్ద సినిమాలే తీసుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో చిన్న సినిమాకు ప్రభుత్వం సపోర్ట్ ఇస్తే బాగుంటుంది.ప్రస్తుతం మా సంస్థలో ‘అంతా రాములోరు చూస్కుంటారు’, 35 మూవీ డైరెక్టర్ నందకిషోర్, కిష్కిందపురి దర్శకుడు కౌషిక్ తో సినిమాలు చేయబోతున్నాను.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్