రాహుల్ విజయ్, ఆర్చన అయ్యర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా 'అ'. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఈనెల 30న విడుదల చేస్తున్నారు.
స్టార్ బాక్స్ స్టోరీస్, రిపుల్ స్లైడ్ స్టూడియోస్ బ్యానర్లపై కనకరావు తొనంగి, అభిషేక్ కె, ప్రముఖ ఎడిటర్ గ్యారీ బీహెచ్ నిర్మించారు. సాయి బాలి దర్శకత్వం వహించారు.
ఈ చిత్రంలోని ‘ఇదేనా ఇదేనా’ అనే లిరికల్ వీడియో సాంగ్ ఆవిష్కరణ వేడుక ఘనంగా జరిగింది. శ్రీచరణ్ పాకాల స్వరాలు సమాకూర్చిన ఈ పాటను షణ్ముఖ భరద్వాజ్ ఆలపించారు. సుమన్ చిక్కాల సాహిత్యం అందించారు.
ఈ పాటను జర్నలిస్ట్‌లు పర్వతనేని రాంబాబు, శివమల్లాల, వేణు బిక్కి, వాసు సజ్జా, హేమ మాలిని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కో ప్రొడ్యూసర్ అభినవ్ మాట్లా డుతూ,‘ఈ ప్రాజెక్ట్ ఇంత బాగా రావడానికి కారణ మైన ఆర్టిస్ట్‌లకు, టెక్నిషియన్స్‌కు కృతజ్క్షతలు’ అని తెలిపారు. ‘ఈ పాట అందరికి నచ్చుతుందని నమ్ము తున్నాను. స్నేహితులు అందరం కలిసి ఈ సినిమా చేస్తున్నాం’ అని నిర్మాత గ్యారీ బీహెచ్ చెప్పారు. శ్రీచరణ్ పాకాల మాట్లాడుతూ, ‘దర్శకుడు సాయి చేసిన ఈ క్రైమ్ థ్రిల్లర్ చూస్తే అందరూ షాక్ అవుతారు’ అని తెలిపారు.
‘టైటిల్ చుట్టు ఉన్న అమ్మాయి.. అదృశ్యం.. అన్వేషణ, అనుమానం.. అసాంఘీకం... అమానుషం వీటి మధ్యే ఈ కథ మొత్తం ఉంది. ఈ సినిమా మిమ్మల్ని కచ్చితంగా థ్రిల్ చేస్తుంది’ అని దర్శకుడు సాయి బాలి చెప్పారు.






కామెంట్‌లు (0)