Magazines

ఆ వీరులే ‘రణబాలి’కి స్ఫూర్తి

54 నిమిషాల క్రితం

ఒక హీరోగా
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 11, 2026 | 2 నిమిషాల చదవడం

‘ఒక హీరోగా నా సినిమాలకు టికెట్ రేట్స్ పెంచడం నాకు ఇష్టం ఉం డదు. ఈ సినిమా నుంచి నా రాబోయే ఏ సినిమాకూ టికెట్ హైక్స్ ఉండవు. డివోషనల్ గా ఏదైనా బయోపిక్ చేసే అవకాశం వస్తే తప్పకుండా నటిస్తా’ అని హీరో విజయ్‌ దేవరకొండ అన్నారు.

ఆయన హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ ‘రణబాలి’.

రాహుల్ సంకృత్యన్ దర్శకుడు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. ఈ నెల 16న విజయదశమి పర్వదినం సందర్భంగా ఈ సినిమా ప్రేక్ష‍కుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హీరో విజయ్ దేవరకొండ మీడియాతో ముచ్చటించారు.

చరిత్రలో మన ప్రజలకు జరిగిన అన్యాయాల గురించి తెలుసుకుంటుంటే ఇవన్నీ నిజమా, ఇంత దారుణంగా జరిగాయా అని షాక్ కు గురవుతాం. మన చరిత్రలో ప్రజల కోసం నిలబడిన ఎంతోమంది గొప్ప వీరులు ఉన్నారు. ఈ వీరులంతా మూడు పదుల్లోనే చనిపోయారు. వారే ‘రణబాలి’కి స్ఫూర్తి. ఆ వీరుల గొప్పదనం, మన పూర్వీకులు ఎదుర్కొన్న దారుణాలు, ఒక సొసైటీగా అప్పుడు మనం చేసిన తప్పేంటి, బ్రిటీషర్స్ ఈ దేశాన్ని ఎలా ఆక్రమించుకున్నారు..ఇలా అన్నింటినీ మేము ఈ సినిమా ద్వారా బిగ్ స్క్రీన్ పై చూపించబోతున్నాం.

ఈ సినిమా విజయం మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. అప్పట్లో మన ఊర్లలో ఉండే వాతావరణం, మన కల్చర్, మన వీరుల గొప్పదనం, చరిత్రలో జరిగింది ఏంటి అనేవి చెబుతూ ఆద్యంతం ఒకే పర్పస్ కోసం ఈ సినిమా చేశాం.

ఇది సాఫ్ట్ గా చెప్పే కథ కాదు, సాఫ్ట్ గా చూపించే ప్రపంచం కాదు. రణబాలి పాత్రలో నేను కనిపించే విధానం, మాట్లాడే విధానం అన్నీ సహజంగా ఉంటాయి. డైరెక్టర్ రాహుల్ అలా డిజైన్ చేశాడు. జయమ్మగా రశ్మిక అయితేనే బాగుంటుంది అనిపించింది. ఈ సినిమాలో మా ఇద్దరి మధ్య మంచి డ్రామా ఎమోషన్ ఉంది.

ఈ సినిమా మీకు గ్రేట్ సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇస్తుంది. ఆద్యంత ఎంగేజ్ చేస్తుంది. ఈ సినిమా చూసి మన చరిత్ర, కల్చర్ గురించి మాట్లాడుకుంటారు.

డివోషనల్ గా ఏదైనా బయోపిక్ చేసే అవకాశం వస్తే తప్పకుండా నటిస్తా.


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్