Magazines

​రైతు సంఘం జాతీయ మహాసభల జయప్రదం కోసం ఎడ్లబండ్ల ర్యాలీ

58 నిమిషాల క్రితం

Bullock cart rally for the success of the Farmers' Union national convention
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 02, 2026 | 1 నిమిషాల చదవడం

ఏఐకేఎస్‌ మహాసభలను జయప్రదం చేయాలి: రైతుసంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు దేవిరెడ్డి అశోక్‌‌రెడ్డి

నవతెలంగాణ-మాడ్గులపల్లి

​రైతు సంఘం జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ రైతుసంఘం ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండల కేంద్రంలో ఆదివారం ఎడ్లబండ్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుసంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు దేవిరెడ్డి అశోక్ రెడ్డి మాట్లాడారు. వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాల పురిటి గడ్డ నల్లగొండలో మొట్టమొదటి సారిగా అఖిల భారత కిసాన్‌ సభ (ఎఐకెఎస్‌) 36వ రైతు సంఘం జాతీయ మహాసభలు ఈనెల 15, 16, 17, 18వ తేదీలలో జరుగనున్నాయన్నారు. నవంబర్‌ 15న లక్ష మంది రైతులతో భారీ ప్రదర్శన, నల్లగొండ ఎన్జీ కళాశాల గ్రౌండ్ లో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ మహాసభలకు దేశ నలుమూలల నుంచి 1500 మంది రైతు ఉద్యమ నేతలు ప్రతినిధులుగా హాజరవుతారని తెలిపారు. ఈ సభలో ప్రధానంగా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై సమగ్రంగా చర్చించి వాటి పరిష్కారానికి భవిష్యత్‌ ఉద్యమ కార్యాచరణను రూపొందించనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించే రైతు సాంస్కృతిక కార్యక్రమాలు, ఎగ్జిబిషన్స్‌, సెమినార్స్‌లలో వ్యవసాయ శాస్త్రవేత్తలతోపాటు వ్యవసాయరంగంపై అవగాహన కలిగిన అనేక మంది మేధావులు పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పుల్లెంల శ్రీకర్, దేవి రెడ్డి మల్లారెడ్డి, భూపతి రెడ్డి, నారాయణరెడ్డి, జూకూరి నాగయ్య, చారి, పతాని శ్రీను, మేడం రవి పాల్గొన్నారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్