Magazines

సాఫ్ట్‌వేర్ ఇం‌జినీర్ ఆకస్మిక మృతి

52 నిమిషాల క్రితం

Sudden death of a software engineer
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 02, 2026 | 1 నిమిషాల చదవడం

​నవతెలంగాణ- మియాపూర్

ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ నిర్వహించిన మారథాన్‌లో ఉత్సాహంగా పాల్గొని, విజయవంతంగా పరుగును పూర్తి చేసి మెడల్ అందుకున్న ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోయిన విషాదకర ఘటన గచ్చిబౌలి స్టేడియంలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా మణికొండలోని అల్కాపూర్ కాలనీకి చెందిన కొమ్మినేని గోపి (36) ఐబీఎం సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఆదివారం గచ్చిబౌలి స్టేడియంలో ఎన్‌ఈబీ సంస్థ నిర్వహించిన మారథాన్‌లో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు. మారథాన్‌ను విజయవంతంగా పూర్తి చేసి మెడల్ కూడా అందుకున్నారు. అనంతరం అల్పాహారం తీసుకునేందుకు వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా అస్వస్థతకు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. దీంతో వెంటనే స్పందించిన మారథాన్ నిర్వాహక బృందం ఆయనను చికిత్స నిమిత్తం సమీపంలోని కేర్ ఆస్పత్రికి తరలించింది. అయితే, అప్పటికే పరిస్థితి విషమించడంతో గోపి మృతి చెందినట్టు వైద్యులు నిర్థారించారు. గుండెపోటు కారణంగానే ఆయన మరణించినట్టు సమాచారం. మారథాన్‌ను ఉత్సాహంగా పూర్తి చేసి, మెడల్ అందుకున్న వ్యక్తి అంతలోనే మృతిచెందడంతో తీవ్ర విషాదం నెలకొంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్