నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఢిల్లీ పర్యటనలో ఉన్న గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా సోమవారం రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తన సతీమణి జానకి శుక్లాతో కలిసి గవర్నర్ మధ్యాహ్నం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ప్రధాని మోడీతో గవర్నర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలోని రాజకీయ అంశాలతో పాటు, పలు విషయాలపై చర్చించినట్టు తెలిసింది. కాగా... రాష్ట్రపతి, ప్రధానితో జరిగిన సమావేశాల ఫొటోలను... గవర్నర్ కార్యాలయంతో పాటు ప్రెసిడెంట్ హౌజ్, పీఎం మోడీ సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పంచుకున్నారు.






కామెంట్‌లు (0)