ఇందిరమ్మ టవర్స్‌ నిర్మాణంలో నాణ్యత

5 గంటల క్రితం

Indiramma Towers
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 29, 2026 | 2 నిమిషాల చదవడం

ప్రతి టవర్‌ ‌వద్ద ఫిర్యాదుల బాక్స్‌ ..‘రెరా’కు పర్యవేక్షణ బాధ్యతలు

చివరి లబ్దిదారుడి వరకూ ఇండ్ల కేటాయింపు : రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి

నవతెలంగాణ-సిటీబ్యూరో

‘క్యూర్’ ప‌రిధిలో ప్ర‌యోగాత్మ‌కంగా తొలి విడ‌త‌ ల‌క్ష ఇండ్లు ల‌క్ష్యంగా నిర్మిస్తున్న ఇందిర‌మ్మ ట‌వ‌ర్స్ నిర్మాణాల్లో నాణ్య‌త‌కు అత్యంత ప్రాధాన్య‌త ఇస్తామ‌ని, దీనికోసం ప్ర‌తి ట‌వ‌ర్ వ‌ద్దా ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటు చేస్తామ‌ని రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్ల‌డించారు. ప్ర‌తి ల‌బ్దిదారుడూ నెలకోసారి స‌ద‌రు ఫ్లాటు నిర్మాణాన్ని ప‌రిశీలించుకుని నాణ్య‌తా లోపం ఉంటే ఆ మేర‌కు ఫిర్యాదుల‌ను ఈ బాక్స్ లో వేయొచ్చని సూచించారు. ఈ ఫిర్యాదులను ప‌రిశీలించి అవ‌స‌ర‌మైతే కాంట్రాక్ట‌ర్ లేదా అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు. మేడ్చల్‌-‌మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరి నియోజకవర్గం కౌకూర్‌లో శ‌నివారం ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌ నిర్మాణానికి స్థానిక ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్‌, ఎమ్మెల్యే మ‌ర్రి రాజ‌శేఖ‌ర‌రెడ్డితో క‌లిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రయివేటు ట‌వ‌ర్స్ నిర్మాణాల నాణ్య‌త‌, కాల‌ప‌రిమితి వంటి అంశాల‌ను ప‌రిశీలించి అనుమ‌తులు ఇచ్చే ‘రెరా’ సంస్ధకు ఇందిర‌మ్మ ట‌వ‌ర్స్ ప‌రిశీల‌న బాధ్య‌త‌ల‌ను ప్ర‌భుత్వం అప్ప‌గిస్తుంద‌ న్నారు. దీనివ‌ల్ల నాణ్య‌త‌తోపాటు నిర్ణీత కాల‌ప‌రిమితిలోగా, వ‌చ్చే బోనాలు, దీపావ‌ళి నాటికి నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. రాష్ట్రంలో రూ.40 వేల కోట్లతో 8 ల‌క్ష‌ల ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణం సాగుతోంద‌న్నారు. ఇప్ప‌టికే 2,25,100 ఇండ్ల నిర్మాణం పూర్తి కాగా, ఇటీవ‌ల లబ్దిదారులు ఆ ఇండ్లల్లోనే దీపావ‌ళి పండుగను జ‌రుపుకున్నార‌ని గుర్తు చేశారు. రానున్న కాలంలో మూడు, నాలుగు విడ‌త‌లుగా ఇండ్లు మంజూరు చేస్తామ‌ని తెలిపారు.

ఇప్పుడు ఇండ్లు రాని పేద‌లు నిరుత్సాహ పడొద్దని, చివ‌రి ల‌బ్దిదారుని వ‌ర‌కూ ఎంపిక చేసి త‌ల‌తాక‌ట్టు పెట్ట‌యినా ఇండ్లు ఇస్తామ‌ని హామీనిచ్చారు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే సూచ‌న‌ల మేర‌కు రాజీవ్ స్వ‌గృహ‌, వాంబే కాల‌నీల్లో మౌలిక సదుపాయాలను యుద్ద‌ప్రాతిప‌దికన క‌ల్పిస్తామ‌ని ఈ వేదిక నుంచే అధికారుల‌కు ఆదేశాలు ఇస్తున్నామ‌ని ప్ర‌క‌టిం చారు. రాజీవ్ స్వ‌గృహ కాల‌నీకి మంచి నీటి స‌మ‌స్య లేకుండా చేస్తామ‌న్నారు. అనంతరం ల‌బ్దిదారుల‌కు ఫ్లాట్స్ మంజూరు కుగాను డ్రా తీసి కేటాయింపు ప‌త్రాల‌ను అంద‌ జేశారు. ఈ కార్య‌క్ర‌మంలో గృహ‌ నిర్మాణశాఖ ఎమ్‌‌డి విపి.గౌత‌మ్, మేడ్చల్‌-‌మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్‌ (‌స్థానిక సంస్థలు) ఫైజాన్ అహ్మద్, మల్కాజిగిరి ఆర్డీఓ శ్యాంప్రకాష్, అల్వాల్ తహసీల్దార్‌ రాములు, జిల్లా హౌసింగ్ బోర్డ్ పీడీ, సిద్ధార్థ్, డీసీసీ అధ్యక్షులు వజ్రేష్‌ ‌యాదవ్‌ పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్