Magazines

ఉన్న కరెంటే ఇవ్వరు..కొత్త కొనుగోళ్లు ఎందుకు?

58 నిమిషాల క్రితం

power
avatar
balaji

ప్రచురించబడింది నవం 03, 2026 | 1 నిమిషాల చదవడం

జెన్కో, సింగరేణిని బలోపేతం చేయండి

ఈఆర్‌సీ ప్రజాభిప్రాయ సేకరణలో మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి


​నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ర్టంలో అందుబాటులో ఉన్న విద్యుత్‌‌నే ప్రజలకు సక్రమంగా సరఫరా చేయలేకపోతున్న ప్రభుత్వం కొత్తగా 7,800 మెగావాట్ల విద్యుత్‌ కొనుగోలు ఎందుకో చెప్పాలని మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌ ‌రెడ్డి నిలదీశారు. థర్మల్‌, సోలార్‌, హైబ్రిడ్‌ విద్యుత్‌‌కు సంబంధించి కొనుగోలు ప్రతిపాదనలపై మంగళవారం హైదరా బాద్‌‌లో విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్సీ) నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో ఆయన బీఆర్‌ఎస్‌ ‌తరపున హాజరై వాదనలు వినిపించారు. రైతుల పొలాలకు కరెంట్‌ అందించడంలో చేతులెత్తేస్తూ, ప్రయివేటు సంస్థల నుంచి విద్యుత్‌ కొనుగోళ్లకు మాత్రం అత్యుత్సాహం ప్రదర్శించడం వెనుక ఉన్న నిజాలను బయటపెట్టాలని డిమాండ్‌ ‌చేశారు. ప్రభుత్వ ప్రతిపాదనల్లో అవసరం ఎంత, ప్రజాప్రయోజనం ఎంత అన్నది నిశితంగా పరిశీలించాలని కోరారు. విద్యుత్‌ కేంద్రాలను పూర్తిస్థాయిలో వినియోగించడంలో విఫలమయ్యారని విమర్శించారు.

సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం వరకు వ్యవసాయానికి విద్యుత్ అందడం లేదని రైతులు చెబుతున్నారని పేర్కొన్నారు. ప్రకటించిన సమయానికి అరగంట ఆలస్యంగా సరఫరా ప్రారంభించి, నిలిపివేస్తామన్న సమయానికి అరగంట ముందే తీసేస్తున్నారన్న ఫిర్యాదులను కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లారు. డిమాండ్‌ అకస్మాత్తుగా పెరిగిందంటూ ప్రభుత్వం తన వైఫల్యాన్ని సమర్థించుకోవాలని చూస్తోందని జగదీష్‌రెడ్డి మండిపడ్డారు. కొత్త కొనుగోళ్ల అవసరాన్ని స్పష్టంగా నిర్ధారించకుండా దీర్ఘకాలిక భారాలకు దారితీసే నిర్ణయాలు తీసుకోవద్దని కమిషన్‌ను కోరారు. ట్రూ అప్‌ చార్జీల పేరుతో ఇప్పటికే వినియోగదారులపై భారం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి అదనపు విద్యుదుత్పత్తి అవసరమైతే ప్రభుత్వ రంగ సంస్థలైన జెన్కో, సింగరేణి ద్వారానే సామర్థ్యాన్ని పెంచాలని డిమాండ్‌ చేశారు. ప్రయివేట్‌ సంస్థలపై ఆధారపడుతూ అధిక ధరలకు విద్యుత్‌ కొనుగోలు చేసేందుకు అనుమతించవద్దని కోరారు. ప్రజాప్రయోజనం లేని ఈ ప్రతిపాదనలను తిరస్కరించాలని ఈఆర్సీకి విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్