Magazines

రూ.2 లక్షలకుపైగా
పంట రుణాల మాఫీ ఎప్పుడు?

30 నిమిషాల క్రితం

రుణమాఫీ
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 05, 2026 | 1 నిమిషాల చదవడం

అదనపు మొత్తం చెల్లించినా వర్తింపజేయలేదని హైకోర్టును ఆశ్రయించిన రైతు

రెండు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలి: 
రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశం

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

బ్యాంకులో రూ.2 లక్షలకుపైగా రుణం ఉండి అదనపు మొత్తం చెల్లించినా తమకు రుణమాఫీ వర్తింపజేయలేదనీ, పోర్టల్‌ ‌సాంకేతిక లోపాలు, ప్రభుత్వ ఆదేశాల పేరుతో తమను ఇబ్బంది పెట్టడం సరిగాదని మెదక్‌‌కు చెందిన రైతు బానప్పగారి మంగ హైకోర్టులో పిల్‌ ‌దాఖలు చేశారు. దీనిపై రెండు వారాల్లోగా కౌంటర్‌ ‌దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది. రైతు తరఫున న్యాయవాది రాయచూరి హరి రోహిన్‌ ‌సింగ్ వాదనలు వినిపించారు. జీవో నెంబర్‌ 567లోని క్లాజ్‌ 4.11 ప్రకారం పంట రుణ బకాయిలు రూ.2 లక్షలకు మించి ఉన్న రైతులు అదనపు మొత్తాన్ని చెల్లిస్తే రూ.2 లక్షల రుణమాఫీ వర్తిస్తుందని స్పష్టంగా ఉందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మంగకు 09.12.2023 నాటికి బ్యాంకులో రూ.2,13,730 రుణం ఉండగా రూ.23 వేలను చెల్లించారనీ, అయినప్పటికీ రూ.2 లక్షల రుణమాఫీ రూ.2 లక్షల రుణమాఫీ ఇప్పటివరకూ ఆమె ఖాతాలో జమకాలేదని ప్రస్తావించారు. ఆర్టీఐ ద్వారా పొందిన అధికారిక సమాచారంలో ఆమె రుణ ఖాతా రుణమాఫీకి అర్హురాలిగా తేలిందనీ, రూ.2 లక్షలు ప్రాసెస్‌ ‌చేయాల్సి ఉందని వ్యవసాయ శాఖ పోర్టల్‌‌లో తేలిందని వివరించారు.

దీనిపై అధికారులను అడిగితే పోర్టల్‌ ‌డేటా ఫ్రీజ్‌ అయిందనీ, ప్రభుత్వ ఆదేశాలు రావాలని చెబుతున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అదనపు మొత్తాన్ని చెల్లించినా రుణమాఫీ కాకపోవడం బాధాకరమనీ, ఇది రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్‌ 14,21, 300-ఎలకు విరుద్ధమని వాదించారు. అర్హులైన రైతులకు న్యాయం చేయాలని కోరారు. రెండు వారాల్లో కౌంటర్‌ అఫిడవిట్‌ ‌దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్