Magazines

ఢిల్లీలో సీపీఐ(ఎం) నేతల ముందస్తు అరెస్టు

1 గంట క్రితం

cpim
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 10, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌: సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఏ. బేబి, కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సహా సీపీఐ(ఎం) సీనియర్ నాయకురాలు బృందా కరత్, రాజ్యసభ ఎంపి జాన్ బ్రిట్టాస్‌లను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిరసనకు ముందే ఎం.వి. గోవిందన్, పి.కె. శ్రీమతి, పి. రాజీవ్ లను అరెస్టు చేశారు. సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీని బలవంతంగా బస్సులోకి ఎక్కిస్తున్న దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. పార్టీ కార్యకర్తలపై పోలీసులు క్రూరమైన అణచివేతకు పాల్పడ్డారు. అయినా తాము ధైర్యంగా నిలబడతామనీ, విజయం సాధిస్తామ"ని ఎక్స్‌లో పేర్కొన్నారు.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్