నవతెలం-గాణ హైదరాబాద్: జంతర్‌మంతర్ నిరసనను చూసి ప్రభుత్వంలో భయం మొదలైందని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ పారదర్శకతను, విశ్వసనీయతను దెబ్బతీస్తున్న ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా చేపడుతున్న ఈ నిరసనను అణచివేయలేరని, ప్రజల గొంతుక మరింత బలంగా వినిపిస్తుందని అన్నారు. "ఇది ప్రజాస్వామ్యానికి సవాలు. దేశాన్ని పోలీసు రాజ్యంగా మార్చే ప్రయత్నం జరుగుతోంది. ప్రజల ఉద్యమాన్ని ఏదీ అణచివేయలేదు. ప్రజాస్వామ్య మద్దతుదారులు జంతర్ మంతర్ వద్దకు తరలివస్తున్నారు. ఈ నిరసనను చూసి ప్రభుత్వం ఇప్పటికే భయపడటం ప్రారంభించింది. ఇటువంటి చర్యలు ఆ భయంలో భాగమే," అని ఆయన అన్నారు.
కేంద్ర ప్రభుత్వంలో భయం మొదలైంది: పినరయి విజయన్
1 గంట క్రితం

Shiva Kumar
ప్రచురించబడింది అక్టో 10, 2026 | 1 నిమిషాల చదవడం




కామెంట్‌లు (0)