Magazines

బస్సులో అగ్నిప్రమాదం

1 రోజు క్రితం

Fire in bus
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 07, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్ గ్రేటర్ నోయిడాలోని ఎక్స్‌ప్రెస్ హైవేపై ఆగ్రా వైపు వెళ్తున్న స్లీపర్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తమై ప్రయాణికులను వెంటనే కిందకు దించేయడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులు కిందకు దిగిన కాసేపటికే బస్సు పూర్తిగా దగ్దమైంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. కానీ అప్పటికే మంటల్లో బస్సు పూర్తిగా తగలబడిపోయింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్