Magazines

ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ఆందోళనలు..మమతా బెనర్జీ,కేజ్రీవాల్ అరెస్ట్

1 గంట క్రితం

tmc
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 10, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: జాతీయ రాజధానిలో శాంతియుత ప్రదర్శన నిర్వహిస్తున్న సమయంలో పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, పలువురు పార్టీ ఎంపీలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో టీఎంసీ ఎక్స్ వేదికగా తెలియజేసింది.


పోలీసుల చర్యను "సూపర్ ఎమర్జెన్సీ"కి సంకేతంగా, "ప్రజాస్వామ్యానికి ఒక చీకటి రోజు"గా అభివర్ణిస్తూ, భిన్నాభిప్రాయాలు వ్యక్తపరిచే రాజ్యాంగ హక్కును అధికారులు అణచివేస్తున్నారని పార్టీ ఎక్స్ వేదికగా ఆరోపించింది. నాయకులను చట్టవిరుద్ధంగా పోలీసు వ్యాన్లలోకి ఎక్కించి, గుర్తుతెలియని ప్రదేశానికి తీసుకువెళ్లారని ఆరోపించింది.


అదే విధంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞనేష్ కుమార్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల మధ్య, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA) నాయకురాలు నేహా బోరాలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, కేజ్రీవాల్ 'X' వేదికగా ఒక వీడియోను పొస్టు చేశారు. దేశ యువత చైతన్యవంతులయ్యారని, నిరసనకారులు బెదిరింపులకు లొంగిపోరని ఆయన స్పష్టం చేశారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్