Magazines

జంతర్ మంతర్ వద్ద 1,000 మంది అదుపులోకి

1 గంట క్రితం

Jantar Mantar
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 10, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. జంతర్ మంతర్ కు ఎవరూ రాకుండా ఢిల్లీ పోలీసులు అనేక ఆంక్షలు విధించారు. ఎక్కడికక్కడ నిరసనకారులను, ప్రతిపక్ష నాయకులను, యువతను, సీజేపీ శ్రేణులను నిర్భందించారు. అయినా కానీ జంతర్ మంతర్ కు యువత తరలివచ్చింది. దీంతో జంతర్ మంతర్ వైపు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించిన సుమారు 1,000 మంది నిరసనకారులను శనివారం నాడు అదుపులోకి తీసుకున్నట్లు ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ సమావేశానికి అనుమతి లేదని నిరసనకారులకు తెలియజేసినప్పటికీ, పోలీసులు వారిని ముందస్తు అదుపులోకి తీసుకోవడం కొనసాగించారు.


ఈ నిరసనలో పాల్గొనేందుకు ముంబై నుండి ఢిల్లీకి వచ్చిన CJP కార్యకర్త అభిజీత్ దిప్కే, ఢిల్లీ విమానాశ్రయంలో విమానం దిగుతుండగా పోలీసులు తనను, తన సహచరులను అదుపులోకి తీసుకున్నారని ఆరోపిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పోస్ట్ చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్