Magazines

గుంతలమయంగా సిద్దిపేట–గజ్వేల్‌ రోడ్డు

2 గంటల క్రితం

road
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 27, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - తొగుట 

సిద్దిపేట నుండి గజ్వేల్ వెళ్లే ప్రధాన రహదారిలో మెట్టు దగ్గర భారీ గుంతలు ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ గుంతల కారణంగా ఇప్పటికే ఎంతోమంది ప్రమాదాలకు గురై గాయాలపాలయ్యారు. గత 3 సంవత్సరాలుగా ఈ సమస్య కొనసాగుతున్నప్పటికీ, తూతూమంత్రంగా మట్టి పోసి తాత్కాలికంగా మరమ్మతులు చేస్తున్నారు. కొద్దిరోజులకే మళ్లీ అదే పరిస్థితి ఏర్పడుతోంది.


దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గం ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, అలాగే సంబంధిత అధికారులు ఈ సమస్యపై వెంటనే స్పందించి శాశ్వత పరిష్కారం చూపేలా రహదారిని పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయించాలని ప్రజ లు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన ఈ రహదారి సమస్యను ఇకపై నిర్లక్ష్యం చేయకుండా శాశ్వత ప్రాతిపదికన రోడ్డు నిర్మాణం, మరమ్మతులు చేపట్టాలని కోరారు. వెంటనే పనులు ప్రారంభించకపోతే పార్టీలకు అతీతంగా ప్రజలతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టాల్సి వస్తుంది. ప్రజల భద్రత కోసం వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజాప్రతినిధులు కోరుతున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్