Magazines

టారిఫ్‌లు తగ్గించుకుందాం

28 సెప్టెంబర్, 2026

Let's reduce the tariffs.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 29, 2026 | 3 నిమిషాల చదవడం

శిఖరాగ్ర సమావేశంలో చైనా, అమెరికా అంగీకారం
60 బిలియన్‌ డాలర్ల వస్తువులపై సుంకాల తగ్గింపునకు నిర్ణయం
బీజింగ్‌ : అమెరికా మొక్కజన్నలు, సౌందర్య సాధనాలు మొదలుకొని చైనా గృహోపకరణాలు, బమ్మల వరకూ ఒకరి నుంచి ఒకరు దిగుమతి చేసుకుంటున్న 60 బిలియన్‌ డాలర్ల విలువైన వస్తువులపై విధించిన సుంకాలను తగ్గించుకోవాలని చైనా, అమెరికా దేశాలు అంగీకరించాయి. అమెరికా-చైనా వాణిజ్య మండలి కింద సాధారణ వస్తువుల వ్యాపారంపై మరింత సానుకూల సుంకాల విధింపు కోసం ఇరు దేశాలు చెరో 30 బిలియన్‌ డాలర్ల వాణిజ్యాన్ని సిఫార్సు చేశాయని అమెరికా వాణిజ్య ప్రతినిధి జెమిసన్‌ గ్రీర్‌ చెప్పారు. ఇది రెండు దేశాలకూ జరుగుతున్న ఎగుమతులలో సుమారు 30 శాతం వస్తువులకు వర్తిస్తుందని ఆయన తెలియజేశారు.

సంప్రదింపుల కొనసాగింపు
పదిహేడు బిలియన్‌ డాలర్ల విలువైన అమెరికా వస్తువుల కొను గోలుకు గతంలో ఇచ్చిన హామీని దృష్టిలో పెట్టుకొని చైనా తన జాబితాను రూపొందించిందని అమెరికా అధ్యక్ష భవనం తెలిపింది. అమెరికా నుంచి ఏటా పాతిక మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల సోయాబీన్‌ను కొనుగోలు చేసేందుకు గతంలో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు చైనా ఇప్పటికే పెద్ద ఎత్తున కొనుగోళ్లను ప్రారంభించింది. వాణిజ్య మండలి నేతృత్వంలో రెండు దేశాలు వ్యవసాయ కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేస్తాయని, మార్కెట్‌ ప్రవేశం, నియంత్రణ వంటి అంశాలపై చర్చించ డానికి ఈ ఏడాది ముగిసే లోగానే ఈ మండలి సమావేశమ వుతుందని చైనా వాణిజ్య శాఖ చెప్పింది. 2027, 2028 సంవత్సరాలలో అమెరికా నుంచి ఏటా పది మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల బగ్గును దిగుమతి చేసుకునేందుకు శిఖరాగ్ర సమావేశం సందర్భంగా చైనా అంగీ కరించింది. ఇది ఏటా చైనా జరుపు తున్న బగ్గు దిగుమతులలో సుమారు రెండు శాతానికి సమానం. కాగా ద్రవీకృత సహజ వాయువు (ఎల్‌ఎన్‌జీ), చమురు ఈ జాబితాలో లేవు. అమెరికా నుంచి బగ్గు దిగు మతులు దేశీయ మార్కెట్‌కు ఊత మిస్తాయని, అలాగే అమెరికా బగ్గు పరిశ్రమకు స్థిరమైన ఆదాయాన్ని, ఉపాధిని కూడా అందిస్తాయని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కృత్రిమ మేధ (ఏఐ) విషయంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి సంప్రదింపులు జర పాలని అమెరికా, చైనా నిర్ణయించాయి. నవంబర్‌ నెలాఖరులోగా ఈ విష యంలో తదుపరి చర్చలు జరు గుతాయి. తమ దేశంలో వ్యాపారం చేయడానికి, బ్రాంచీలను ఏర్పాటు చేయడానికి అమెరికా మూలధనం ఉన్న సంస్థలు సహా విదేశీ ఆర్థిక సేవా సంస్థలను చైనా పరిశీలించి ఆమో దిస్తుంది. రెండు దేశాల మధ్య విమాన సర్వీసుల పెంపుపై కూడా సంప్రదిం పులు కొనసాగుతాయి.

చైనా జాబితాలోని వస్తువులు ఇవే
గత వారం వాషింగ్టన్‌లో అమెరికా, చైనా అధ్యక్షులు డొనాల్డ్‌ ట్రంప్‌, జిన్‌పింగ్‌ మధ్య శిఖరాగ్ర సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ చర్చలలో పరస్పర సుంకాల తగ్గింపు, వాణిజ్య ఒప్పందం పొడిగింపు వంటివి కీలక అంశాలుగా మారాయి. మొక్కజన్న, గోధుమ, జన్న, మాంసం, పాల ఉత్పత్తులు, కూరగాయలు, నూనెలు, పిండి పదార్థాలు సహా పలు అమెరికా వ్యవసాయోత్పత్తులపై సుంకాలను తగ్గించాలని చైనా యోచిస్తోందని శ్వేతసౌధం విడుదల చేసిన జాబితా వివరించింది. అయితే ఈ జాబితాలో సోయాబీన్స్‌ ప్రస్తావన లేదు. అమెరికా చేపలు, సముద్ర ఆహారం, కలప దుంగలు, కలప ఉత్పత్తులు, సౌందర్య సాధనాలు, వైద్య పరికరాలపై కూడా సుంకాలను తగ్గించేందుకు బీజింగ్‌ సుముఖంగా ఉంది.
వీటిపై అమెరికా టారిఫ్‌లు తగ్గుతాయి

చైనా నుంచి దిగుమతి అవుతున్న కాఫీ మేకర్లు, టోస్టర్లు, భోజన సామగ్రి, దుప్పట్లు, పరుపులు వంటి గృహోపకరణాలపై సుంకాలను తగ్గించాలని అమెరికా నిర్ణయించింది. ఈ జాబితాలో బమ్మలు, బాణసంచా, కృత్రిమ పూలు, క్రిస్మస్‌ ట్రీ దీపాలు, ఇతర పండుగ అలంకరణలు, పిల్లల కార్‌ సీట్లు కూడా ఉన్నాయి. గతంలో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాన్ని రెండు నెలల పాటు...అంటే వచ్చే ఏడాది జనవరి 10వ తేదీ వరకూ పొడిగించడం వల్ల దానిని సమీక్షించుకోవడానికి, అలాగే ఆయా రంగాలలో ఎలా ముందుకు పోవాలో ఆలోచించుకోవడానికి ఇరుపక్షాలకూ తగిన సమయం లభిస్తుందని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. ఇరు దేశాలకు చెందిన కంపెనీల మధ్య సహకారానికి, చర్చల కొనసాగింపునకు అవసరమైన వాతావరణాన్ని కూడా ఈ సమయం కల్పిస్తుంది. పెట్టుబడులకు అవకాశాలు, అవరోధాలపై ఇరు పక్షాలు క్రమం తప్పకుండా చర్చలు జరుపుతాయని, విధానపరమైన పారదర్శకతను మెరుగుపరుస్తాయని కూడా చైనా వాణిజ్య శాఖ వివరించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్