మహిళలపై హింస నిర్మూలన దినోత్సవం సందర్భంగా
ప్రపంచవ్యాప్తంగా ర్యాలీలు
ప్లకార్డులు, బ్యానర్లతో వినూత్న రీతిలో హోరెత్తిన ప్రదర్శనలు
జెనీవా : హింసకు వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా మహిళా లోకం కదం తొక్కింది. ‘మేమూ మనుషులమే.. మాపై దాడులు ఆపండి’ అంటూ గళమెత్తింది. మహిళలపై హింస నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు దేశాల్లో మహిళలు ర్యాలీలు నిర్వహించారు. ప్లకార్డులు, బ్యానర్లు చేతబట్టుకుని వినూత్న రీతిలో చేపట్టిన నిరసన ప్రదర్శనలు హోరెత్తాయి. ఐక్యరాజ్యసమితి మాదకద్రవ్యాలు, నేరాల కార్యాలయం (యూఎన్ఓ డీసీ ), ఐక్యరాజ్య సమితి మహిళా విభాగం గణాంకాల ప్రకారం.. గతేడాది ప్రపంచవ్యాప్తంగా సుమారు 47,000 మంది మహిళలు , బాలికలు వారి సన్నిహిత భాగస్వాములు లేదా కుటుంబ సభ్యుల చేతిలో ఉద్దేశపూర్వకంగా హత్యకు గురైనట్టు ధ్రువీ కరించింది.
అంతర్జాతీయ దినోత్సవానికి అను గుణంగా ‘2026 ఫెమిసైడ్ బ్రీఫ్’లో ప్రచు రించిన ఈ గణాంకాలు, ప్రపంచవ్యాప్తంగా లింగ-ఆధారిత హత్యల తీవ్రతను వివరిం చాయి. 2024 నాటికి బాధితుల సంఖ్య 50,000గా అంచనా వేయగా, 47,000 ఈ సంఖ్య దానికంటే తక్కువగానే ఉన్నప్పటికీ, ఈ మార్పు మహిళల హత్యలలో వాస్తవ తగ్గుదలను కాకుండా, దేశాల వారీగా మెరుగైన గణాంకా లను ప్రతిబింబిస్తోందని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి హత్యలు నమోదవ్వడంతో, ఏ ప్రాంతమూ మినహా యింపుగా నిలవలేదు. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం హత్యల రేటు తగ్గినప్పటికీ, మహిళల హత్యల రేటు మాత్రం నెమ్మదైన వేగంతో తగ్గినా..వేధింపులు మాత్రం కొనసాగుతూనే ఉన్నట్టు ఐక్యరాజ్యసమితి గుర్తించింది.







కామెంట్లు (0)