Magazines

ఉక్రెయిన్ రైల్వే స్టేషన్‌పై రష్యా డ్రోన్ దాడి.. 20 మందికి పైగా మృతి

7 గంటల క్రితం

Russian drone attack on Ukrainian railway station, more than 20 dead
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 30, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి డ్రోన్ దాడులకు పాల్పడింది. గురువారం ఉదయం నిప్రో నగరంలోని ప్రధాన రైల్వే స్టేషన్‌ను లక్ష్యంగా చేసుకుని జెట్‌ పవర్డ్‌ డ్రోన్‌తో దాడి చేసింది. ఈ ఘటనలో కనీసం 14 మంది మృతి చెందగా, మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. దేశవ్యాప్తంగా జరిగిన ఇతర దాడులతో కలిపి మృతుల సంఖ్య 20 దాటింది. జపోరిజియా వెళ్లే ప్యాసింజర్ రైలు, మరో కమ్యూటర్ రైలు ప్లాట్‌ఫామ్‌పై ఉన్న సమయంలో ఈ దాడి జరిగింది. మృతుల్లో 11 ఏళ్ల బాలుడు కూడా ఉన్నట్లు ప్రాంతీయ గవర్నర్ ఒలెక్సాండర్ హంజా తెలిపారు. చెర్నిహివ్‌లో జరిగిన దాడిలో ఇద్దరు బాలికలు, క్రెమెన్‌చుక్‌లో ముగ్గురు మరణించారు. దేశవ్యాప్తంగా 50 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. ఈ దాడిని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తీవ్రంగా ఖండించారు. పౌరులు ప్రయాణించే రైల్వే స్టేషన్‌ను లక్ష్యంగా చేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, రష్యాపై కఠిన ఆంక్షలు విధించాలని అమెరికా, ఐరోపా దేశాలను కోరారు. అయితే పౌరులను లక్ష్యంగా చేసుకోలేదని రష్యా వాదిస్తోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్