Magazines

ఆర్చరీలో శీతల్‌కు మరో స్వర్ణాలు

1 గంట క్రితం

Sheetal in archery
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 23, 2026 | 2 నిమిషాల చదవడం

ఆసియా పారా క్రీడల్లో భారత్‌కు 89 పతకాలు

నగోయా(జపాన్‌): మహిళల కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగంలో శీతల్‌ దేవి వరుసగా రెండో బంగారు పతకాన్ని సాధించింది. గురువారం జరిగిన మహిళల కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకం సాధించిన శీతల్‌.. ఈ స్వర్ణ పతకం గెలవడానికి కొన్ని గంటల ముందే తోమన్‌ కుమార్‌తో కలిసి కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలోనూ పసిడి పతకం సాధించింది. ఒకే రోజు రెండు స్వర్ణాలు గెలుచుకుని భారత పతకాల సంఖ్యను పెంచింది. ఈ ఆసియా పారా క్రీడల్లో శీతల్‌కు ఇది వరుసగా మూడో స్వర్ణ పతకం.వ్యక్తిగత, మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగాల్లో స్వర్ణాలు సాధించగా, మహిళల డబుల్స్‌లో ఒడిశాకు చెందిన పాయల్‌ నాగ్‌తో కలిసి రజత పతకాన్ని గెలుచుకుంది. 5వ ఆసియా పారా క్రీడల్లో నాల్గోరోజు పోటీలు ముగిసేసరికి భారత్‌ 21స్వర్ణ, 27 రజత, 41 కాంస్యాలతో సహా మొత్తం 89 పతకాలతో 4వ స్థానంలో ఉంది.

టేబుల్‌ టెన్నిస్‌లో భవినా జోడీకి కాంస్యం

మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఎక్స్‌డీ7 టేబుల్‌ టెన్నిస్‌ విభాగంలో భారత జోడీ భవినా పటేల్‌, శుభమ్‌ వాధ్వా కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. సెమీఫైనల్లో దక్షిణ కొరియాకు చెందిన జాంగ్‌ యంగ్‌జిన్‌, లీ మిగ్యూ జోడీ చేతిలో ఓడిపోయింది. అయితే, సెమీఫైనల్‌కు చేరడం ద్వారా భారత జోడీకి పతకం ఖాయమైంది. ఇదే పోటీల్లో మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఎక్స్‌డి17 విభాగంలో దత్తప్రసాద్‌ చౌగులే, సవిత జోడీకి నిరాశ ఎదురైంది. ఫిలిప్పీన్స్‌కు చెందిన విల్‌ఫ్రెడ్‌ రెడుల్లా, మాంగిన్సే ల్హే జోడీతో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో తొలి రెండు గేములు గెలిచినా, ఆ తర్వాత వరుసగా మూడు గేములు కోల్పోయింది. అటు బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌ ఎస్‌ఎల్3 విభాగంలో సంజనా కుమారి కాంస్యం నెగ్గింది. అంతకుముందు పురుషుల సింగిల్స్‌ ఎస్‌ఎల్‌4 కేటగిరీలో అభిజీత్, సుహాస్‌ యతిరాజ్ కాంస్యాలను సాధించారు.

Sheetal in archeryడిస్కస్‌ త్రోలో సువర్ణ రాజ్‌కు పసిడి

భారత అథ్లెటిక్స్‌ విభాగంలో సువర్ణ రాజ్‌ మరో విజయాన్ని అందించింది. మహిళల ఎఫ్‌54 డిస్కస్‌ త్రోలో 15.66 మీటర్ల అత్యుత్తమ ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని సాధించింది. గ్రేటర్‌ నోయిడాకు చెందిన 44 ఏండ్ల సువర్ణ, ఆరు ప్రయత్నాల్లో నాలుగుసార్లు డిస్కస్‌ను 15 మీటర్లకు పైగా విసిరి నిలకడను చాటుకుంది. ఐదో ప్రయత్నంలో నమోదైన 15.66 మీటర్లే ఆమెకు పసిడిని అందించింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్