Magazines

టీమిండియా రికార్డు ఛేదన

1 గంట క్రితం

Team India's record chase
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 23, 2026 | 3 నిమిషాల చదవడం

226పరుగుల భారీ లక్ష‍్యం ఉఫ్‌... సంజు ముందు.. నమన్‌ చివర్లో.. విధ్వంసం
న్యూజిలాండ్‌పై తొలి టీ 20లో భారత్‌ సంచలన విజయం

క్రైస్ట్‌చర్చ్‌: న్యూజిలాండ్ గడ్డపై టీమిండియాకు అదిరే ఆరంభం లభించింది. క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా గురువారం జరిగిన తొలి టీ20లో కివీస్‌ నిర్దేశించిన 226 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా మరో 2 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియాకు ఇదే అత్యుత్తమ ఛేదన. ఓపెనర్‌ సంజు శాంసన్‌(67; 33బంతుల్లో 8ఫోర్లు, 4సిక్సర్లు) ధనా ధన్‌ ఇన్నింగ్స్‌కి తోడు చివర్లో నమన్‌ ధీర్‌(42నాటౌట్‌; 15బంతుల్లో 5ఫోర్లు, 2సిక్సర్లు) మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చేశారు. మిడిలార్డర్‌లో కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (42; 28 బంతుల్లో ఫోర్‌, 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్‌ ఆడి టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించాడు. దీంతో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టి20లో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో సంచలన విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్‌ 1–0 ఆధిక్యంలో నిలువగా.. రెండో టీ20 24న జరగనుంది. ఓపెనర్లు సంజు శాంసన్‌, అభిషేక్‌ శర్మ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు కేవలం 5.5 ఓవర్లలోనే 93 పరుగులు జోడించారు. అభిషేక్‌ 12 బంతుల్లో 29 పరుగులు చేసి మైకేల్‌ బ్రేస్‌వెల్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ తర్వాత సంజు శాంసన్‌ 33 బంతుల్లో 67 పరుగులు చేసి మిచెల్‌ శాంట్నర్‌ బౌలింగ్‌లో వికెట్‌ కోల్పోయాడు. తిలక్‌ వర్మ 11 బంతుల్లో 6 పరుగులు చేసి బ్రేస్‌వెల్‌కు చిక్కగా... ఇషాన్‌ కిషన్‌ 3 బంతుల్లో ఒక్క పరుగు చేసి శాంట్నర్‌ బౌలింగ్‌లోనే వెనుదిరిగాడు. దీంతో భారత్‌ 122 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అక్షర్‌ పటేల్‌ 14 బంతుల్లో 24 పరుగులు చేసి ఫెర్గూసన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ దశలో శ్రేయస్‌ అయ్యర్‌ కీలక ఇన్నింగ్స్‌ ఆడగా.. చివర్లో నమన్‌ ధీర్‌ విధ్వంసం సృష్టించాడు. దీంతో భారత్‌ 19.4 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. అంతకుముందు టాస్‌ గెలిచిన భారత్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. న్యూజిలాండ్‌ ఓపెనర్లు టిమ్‌ సీఫర్ట్‌(24), ఫిన్‌ అలెన్‌(45), డారిల్‌ మిచెల్‌(28) అర్ష్‌దీప్‌ సింగ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ తర్వాత గ్లెన్‌ ఫిలిప్స్‌ భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 40 బంతుల్లో 82 పరుగులతో అజేయంగా నిలిచాడు. బెవన్‌ జాకబ్స్‌ 16 బంతుల్లో 31 పరుగులు, మైకేల్‌ బ్రేస్‌వెల్‌ 6 బంతుల్లో 7 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. భారత బౌలింగ్‌లో మయాంక్‌ యాదవ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, అక్షర్‌ పటేల్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు. భారీ అంచనాలతో జట్టులో చేరిన భువనేశ్వర్‌ కుమార్‌ నాలుగు ఓవర్లలో 49 పరుగులిచ్చాడు. ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ సంజు శాంసన్‌కు దక్కింది.

స్కోర్‌బోర్డు...

న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌: షెపర్ట్‌ (సీ) సంజు (బీ)మయాంక్‌ 24, ఫిన్‌ అలెన్‌ (సీ)తిలక్‌ వర్మ (బీ)అక్ష‍ర్‌ పటేల్‌ 45, మిఛెల్‌ (సీ)భువనేశ్వర్‌ (బీ)ఆర్ష్‌దీప్‌ 28, గ్లెన్‌ ఫిలిప్స్‌ (నాటౌట్‌) 82, జాకోబ్స్‌ (రనౌట్‌)ఆర్ష్‌దీప్‌ 31, బ్రాస్‌వెల్‌ (నాటౌట్‌) 7, అదనం 8. (20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి) 235పరుగులు.

వికెట్ల పతనం: 1/49, 2/80, 3/122, 4/195

బౌలింగ్‌ : భువనేశ్వర్‌ 4-0-49-0, ఆర్ష్‌దఈప్‌ 4-0-45-1, మయాంక్‌ యాదవ్‌ 4-0-40-1, అక్ష‍ర్‌ పటేల్‌ 4-0-51-1, నితీశ్‌ కుమార్‌ 4-0-40-0,

ఇండియా ఇన్నింగ్స్‌: సంజు శాంసన్‌ (బీ) సాంట్నర్‌ 67, అభిషేక్‌ శర్మ (సీ)మిల్నే (బీ)బ్రాస్‌వెల్‌ 29, తిలక్‌ వర్మ (సీ)ఫెర్గుసన్‌ (బీ)బ్రాస్‌వెల్‌ 6, శ్రేయస్‌ అయ్యర్‌ (సీ)సాంట్నర్‌ (బీ)మిల్నే 42, ఇషాన్‌ కిషన్‌ (సీ)అలెన్‌ (బీ)సాంట్నర్‌ 1, అక్ష‍ర్‌ పటేల్‌ (సీ)కాన్వే (బీ)ఫెర్గుసన్‌ 24, నమన్‌ ధీర్‌ (నాటౌట్‌) 42, నితీశ్‌ కుమార్‌ (నాటౌట్‌) 2, అదనం 17. (19.4ఓవర్లలో 6వికెట్ల నష్టానికి) 230పరుగులు.

వికెట్ల పతనం: 1/93, 2/115, 3/117, 4/122, 5/167, 6/210

బౌలింగ్‌: హెన్రీ 3.4-0-57-0, మిల్నే 3-0-43-1, ఫెర్గుసన్‌ 3-0-34-1, బ్రాస్‌వెల్‌ 4-0-37-2, సాంట్నర్‌ 4-0-39-2, స్మిత్‌ 2-0-20-0.
Team India's record chase



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్