Magazines

రెండో టెస్ట్‌లో దక్ష‍ిణాఫ్రికా విజయం

1 గంట క్రితం

avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 23, 2026 | 1 నిమిషాల చదవడం

ఇన్నింగ్స్‌ 31 పరుగుల తేడాతో ఓడిన ఆస్ట్రేలియా

గెబెర్హా(దక్ష‍ిణాఫ్రికా) : ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్ట్‌లో దక్ష‍ిణాఫ్రికా జట్టు ఘన విజయం సాధించింది. ఫాలోఆన్‌ ఆడుతూ ఆస్ట్రేలియా... ఓవర్‌నైట్‌ స్కోర్‌ 4 వికెట్ల నష్టానికి 156పరుగులతో గురువారం రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించి 295పరుగులకు ఆలౌటైంది. ట్రెవీస్‌ హెడ్‌(121) సెంచరీకి తోడు బోలండ్‌(40, క్యారీ(37నాటౌట్‌) మాత్రమే బ్యాటింగ్‌లో రాణించారు. ముఖ్యంగా హెడ్‌-బోలండ్‌ 5వ వికెట్‌కు 59 పరుగులు జతచేసి సఫారీ బౌలర్లను విసిగించారు. ఈ జోడీని ముల్డర్‌ విడదీశారు. ఆ తర్వాత ఏ ఒక్క బ్యాటర్‌ క్రీజ్‌లో కుదురుకునే అవకాశం ఇవ్వలేదు. దీంతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ 107.1 ఓవర్లలో 295పరుగుల వద్ద ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో దక్ష‍ిణాఫ్రికా 425పరుగులకు డిక్లేర్డ్‌ చేయగా.. ఆసీస్‌ జట్టు కేవలం 99 పరుగులకే కుప్పకూలింది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ తెంబు బవుమాకు లభించింది. దీంతో మూడు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరుజట్లు 1-1తో సమంగా నిలువగా.. మూడో, చివరి టెస్ట్‌ 27నుంచి కేప్‌టౌన్‌ వేదికగా ప్రారంభం కానుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్