బ్రహ్మ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ మీద శాంతి కుమార్ చిలుముల, రామానుజ రెడ్డి వంగపాటి నిర్మాణంలో శాంతి కుమార్ చిలుముల తెరకెక్కించిన చిత్రం ‘321’. ఉప శీర్షిక లవ్ మ్యారేజ్ వర్సెస్ అరెంజ్డ్. మోహిత్, లావణ్య జంటగా నటించారు. ఈ చిత్రాన్ని నేడు (శుక్రవారం) విడుదల చేయబోతోన్నారు. ఈ సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు. అనంతరం చిత్రయూనిట్ మీడియాతో ముచ్చటించింది. దర్శక, నిర్మాత శాంతి కుమార్ మాట్లాడుతూ,‘నాకు ఈ జర్నీలో తోడుగా నిలిచిన మోహన్, మయూర్ పట్నాల, మర్రి రాజశేఖర్ రెడ్డికి థాంక్స్. ఐటీ అనేది నా ప్రొఫెషన్, ఆర్ట్స్ అనేది నా ప్యాషన్. ఈ చిత్రంలోని ఆర్టిస్టులంతా కూడా అద్భుతంగా నటించారు. మాధవి సహకారం ఎప్పటికీ మర్చిపోలేం. ఆమె ఇచ్చిన రిఫరెన్సులతోనే ఎంతో మంది ఆర్టిస్టుల్ని ఈ చిత్రంలో తీసుకున్నాం. కాల్విన్ జాయ్ మ్యూజిక్ బాగా వచ్చింది. మౌన శ్రీ పాటలు రాయడమే కాకుండా ఈ సినిమాలో మంచి పాత్రను పోషించారు. సినిమా అద్బుతంగా వచ్చింది. కుటుంబ సమేతంగా చూసేలా మా చిత్రం ఉంటుంది. అదే మా సినిమా ప్రత్యేకత. ఎందుకంటే ఇది ఏ ఒక్క వర్గానికో కాదు అందరికీ నచ్చుతుంది’ అని తెలిపారు.
‘నేను ఇండస్ట్రీలో చాలా మంది వద్ద అసిస్టెంట్ కెమెరామెన్‌గా పని చేశాను. శాంతి కుమార్‌తో నాకు ఎన్నో ఏళ్ల నుంచి అనుబంధం ఉంది. ఈ మూవీతో నేను నిర్మాతగా పరిచయం కాబోతోన్నాను. ఈ సినిమా చాలా బాగుంటుంది’ అని నిర్మాత రామానుజ రెడ్డి చెప్పారు.





కామెంట్లు (0)