Magazines

లోయలో పడ్డ బస్సు.. 8 మంది మృతి

17 అక్టోబర్, 2026

Rajastan Bus accident
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 17, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌: ఢిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్‌వే దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 27 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు లోయలో పడిపోయింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 8 మంది అక్కడిక్కడే మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ నుంచి రాజస్థాన్‌లోని ఖాటూ శ్యామ్‌ ఆలయానికి వెళ్తుండగా డ్రైవర్‌ నిద్రమత్తువల్ల హైవే కంచెను ఢీకొట్టి లోయలో పడిందని ప్రాథమీకంగా అంచనా వేశామని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో మరో 17 మంది గాయపడ్డారని వెల్లడించారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టామని తెలిపారు. మరోవైపు క్ష‍తగాత్రులను రాజాస్తాన్‌లోని కోటా ఎంబీఎస్‌ ఆస్పత్రి, న్యూ మెడికల్‌ కాలేజీలకు తరలించి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని స్పష్టం చేశారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్