నవతెలంగాణ - హైదరాబాద్ : నేపాల్ మెరుపు వరదల ఘటన మరువకముందే భూటాన్‌లో మరో ప్రకృతి విపత్తు సంభవించింది. వాయవ్య భూటాన్‌లోని గాసా జిల్లాలో షింటాఫు సరస్సు ఉప్పొంగడంతో భారీ వరదలు సంభవించాయి. దీంతో భారత్‌లోని పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. ఆయా రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు మెరుపు వరదల ముప్పు ఉందన్న అంచనాలతో హైఅలర్ట్ ప్రకటించారు. గాసా జిల్లాలోని మో చు నది పరివాహక ప్రాంతంలో ఉన్న గాసా త్చాచు వేడినీటి బుగ్గ వద్ద సౌకర్యాలన్నీ వరదలో కొట్టుకుపోయాయి. అయితే ముందస్తుగానే ప్రజలను ఖాళీ చేయించడంతో ప్రాణనష్టం తప్పింది.
భూటాన్‌లో హిమానీనదం విస్ఫోటం.. భారత్‌లో హైఅలర్ట్
7 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 30, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)