Magazines

భారత్‌-శ్రీలంక తొలి వన్డే వేదిక మార్పు.. విశాఖకు మ్యాచ్‌ తరలింపు

1 గంట క్రితం

India-Sri Lanka first ODI venue changed.. match shifted to Visakhapatnam
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 05, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ క్రికెట్‌ అభిమానులకు శుభవార్త. భారత్‌-శ్రీలంక జట్ల మధ్య జరగనున్న తొలి వన్డే మ్యాచ్‌ వేదిక మారింది. తొలుత ఢిల్లీలో నిర్వహించాలని నిర్ణయించిన ఈ మ్యాచ్‌ను విశాఖపట్నానికి మారుస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. డిసెంబర్‌ 13న జరగనున్న ఈ మ్యాచ్‌ తేదీలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది.

ఢిల్లీలో డిసెంబర్‌ నెలలో ఉండే ప్రతికూల వాతావరణ పరిస్థితులు, స్టేడియంలో చేపట్టాల్సిన పునరుద్ధరణ పనుల నేపథ్యంలో వేదికను మార్చాలని ఢిల్లీ అండ్‌ డిస్ట్రిక్ట్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (డీడీసీఏ) బీసీసీఐని కోరింది. ఈ విజ్ఞప్తిని పరిశీలించిన బీసీసీఐ తొలి వన్డేను విశాఖలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్‌ స్టేడియానికి తరలించింది.

శ్రీలంక భారత పర్యటన 2026 షెడ్యూల్‌

వన్డే సిరీస్‌

  • తొలి వన్డే: డిసెంబర్‌ 13 – విశాఖపట్నం

  • రెండో వన్డే: డిసెంబర్‌ 16 – బెంగళూరు

  • మూడో వన్డే: డిసెంబర్‌ 19 – అహ్మదాబాద్‌

టీ20 సిరీస్‌

  • తొలి టీ20: డిసెంబర్‌ 22 – రాజ్‌కోట్‌

  • రెండో టీ20: డిసెంబర్‌ 24 – కటక్‌

  • మూడో టీ20: డిసెంబర్‌ 27 – పుణే

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్