Magazines

తెలంగాణలో పచ్చి గుడ్ల మయోనైజ్‌పై ఏడాది నిషేధం

1 గంట క్రితం

One-year ban on raw egg mayonnaise in Telangana

One-year ban on raw egg mayonnaise in Telangana

వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 05, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : ప్రజారోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లలో పచ్చి గుడ్లతో తయారు చేసే మయోనైజ్‌ అమ్మకాలు, నిల్వలపై ఏడాది పాటు నిషేధం విధించింది. ఈ మేరకు ఆహార భద్రతా కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

పచ్చి గుడ్ల వినియోగం వల్ల సాల్మొనెల్లా వంటి బ్యాక్టీరియా వ్యాప్తి చెంది ఫుడ్‌ పాయిజనింగ్‌ కేసులు పెరుగుతున్నాయని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే నిషేధం విధించినట్లు వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన క్రిమినల్‌ చర్యలు తీసుకోవడంతో పాటు సంబంధిత సంస్థల లైసెన్సులు రద్దు చేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్