Magazines

పారిస్‌లో కాల్పుల కలకలం..

23 అక్టోబర్, 2026

Shootings in Paris..
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 23, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : ఫ్రాన్స్‌లోని పారిస్‌లో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఇందులో ఒకరు మృతి చెందగా.. మరో నలుగురు గాయపడ్డారని ఫ్రాన్స్‌ ప్రధాని సెబాస్టియన్ లెకోర్ను తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. సమీప పట్టణానికి చెందిన అతడు.. కారులో నుంచే కాల్పులకు తెగబడ్డాడు. దీని వెనుక ఉద్దేశం ఏమిటనేది ఇంకా తెలియలేదు. ఘటనాస్థలిలో భద్రతా దళాలను మోహరించినట్లు ప్రధాని తెలిపారు. జాతీయ ఉగ్రవాద వ్యతిరేక ప్రాసిక్యూటర్ కార్యాలయం పరిస్థితిని పర్యవేక్షిస్తోందని పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్