Magazines

అనంత్‌సింగ్ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు

2 గంటల క్రితం

Supreme Court cancels Anant Singh's bail
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 30, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : మాజీ ఆర్జేడీ నేత, జన సూరజ్‌ మద్దతుదారుడు దులార్‌ చంద్‌ యాదవ్‌ హత్య కేసులో బహిష్కృత జేడీ(యూ) ఎమ్మెల్యే అనంత్‌సింగ్‌కు మంజూరైన బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. డిసెంబర్‌ 1లోగా అధికారుల ఎదుట లొంగిపోవాలని ఆయనను ఆదేశించింది. జస్టిస్‌ ఎం.ఎం. సుందరేశ్‌, జస్టిస్‌ ప్రసన్న బి. వరాలేలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసు దర్యాప్తును నాలుగు నెలల్లోగా పూర్తి చేయాలని బీహార్‌ పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు నెలల పాటు వాయిదా వేసింది.


అనంత్‌సింగ్‌కు మార్చి 19న పాట్నా హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను సవాలు చేస్తూ మృతుడి కుటుంబ సభ్యుడు నీరజ్‌ కుమార్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అనంత్‌సింగ్‌ నేర చరిత్రను, పలు క్రిమినల్‌ కేసుల్లో ఆయన ప్రమేయాన్ని బెయిల్‌ మంజూరు చేసే సమయంలో హైకోర్టు తగినంతగా పరిగణనలోకి తీసుకోలేదని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అనంత్‌సింగ్‌ నేర చరిత్రపై పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఆందోళన వ్యక్తం చేయడంతో, బెయిల్‌ ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు గతంలోనే నోటీసులు జారీ చేసింది. తాజా విచారణలో బెయిల్‌ను రద్దు చేస్తూ ధర్మాసనం నిర్ణయం తీసుకుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్