Magazines

తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం

1 రోజు క్రితం

Team India secures a resounding victory in the first ODI
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026 | 1 నిమిషాల చదవడం



నవతెలంగాణ-హైదరాబాద్: ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. నాలుగు వికెట్ల తేడాతో(డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో) భారత్ విక్టరీ సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్.. 40.2 ఓవర్లలో 185 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 4, గుర్నూర్ బ్రార్ 3, అన్షుల్ కాంబోజ్ 2 వికెట్లతో చెలరేగారు.


అనంతరం వర్షం అంతరాయం కలిగించడంతో టార్గెట్ 32 ఓవర్లలో 143 పరుగులకు కుదించారు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(74) అర్ధ సెంచరీతో రాణించండంతో భారత్ 22.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. కివీస్ బౌలర్లలో డఫీ మూడు వికెట్లు సాధించాడు. జెమీసన్, నాథన్ స్మిత్ చెరో వికెట్ తీశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్