నవతెలంగాణ - హైదరాబాద్ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెయిన్స్ 2026 ఫలితాలను విడుదల చేసింది. మొత్తం 1,016 ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షల ఫలితాలను కమిషన్ ప్రకటించింది. ఆగస్టు 21, 22, 23, 29, 30 తేదీల్లో ఈ పరీక్షలు జరిగాయి. మొత్తం 13,343 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకాగా, వారిలో 2,526 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరంతా తదుపరి దశ అయిన పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ)కు అర్హత సాధించారు. అర్హులైన అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను పరిశీలించుకోవచ్చు.
యూపీఎస్సీ మెయిన్స్ 2026 ఫలితాలు విడుదల..
52 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 05, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)