బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కుంభం రాఘవరెడ్డి
నవతెలంగాణ - మల్హర్ రావు
తాడిచెర్ల గ్రామపరిధిలోని శాత్రజ్ పల్లిలో అప్పులు ఇండ్లు నిర్మాణం చేపట్టిన బాధితులకు నోటీసులు జారిచేయకుండా అధికారులు అర్ధరాత్రి దొంగల్లా ఎలా కూల్చేస్తారని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కుంభం రాఘవ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇళ్లను కూల్చివేస్తుండగా కొందరు బాధితులు జేసీబీలకు అడుగా వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిని నిలువరించినట్లుగా పేర్కొన్నారు.
ప్రభుత్వం, సంబంధించిన అధికారులు నిబంధనల ప్రకారం ఇదే తాడిచెర్ల జీపీ పరిధిలో కాపురం పల్లెకు ఒక విధంగా, శాత్రాజ్పల్లిలో ఇంకో విధంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఒకే గ్రామపంచాయతీ పరిధిలో పరిహారం, పునరావాసం విషయంలో వేర్వేరు ప్రమాణాలు పాటిస్తున్నారాని నిలదీశారు. పేదల ఇండ్ల కూల్చివేతలపై విచారణ చేపట్టి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి ఇళ్లను కూల్చివేయడం చట్టబద్ధమేనా.? బాధితులకు తమ వాదన వినిపించే అవకాశం కల్పించారాని ప్రశ్నించారు.







కామెంట్‌లు (0)