Magazines

కొలనుపాక పేదలకు ఇంటి స్థలాలు కేటాయించాలి!

19 నిమిషాల క్రితం

citu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 23, 2026 | 2 నిమిషాల చదవడం

- ప్రభుత్వ భూమిని నిరుపేదలకు పంపిణీ చేయాలి.. రెండున్నరేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం శూన్యం

- ప్రజావాణిలో సీపీఐ వినతి.. స్పందించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరిక

నవతెలంగాణ ఆలేరు రూరల్ : ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలోని నిరుపేదలకు ప్రభుత్వ భూమిలో ఇంటి స్థలాలు కేటాయించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం ఆలేరు ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో సీపీఐ నాయకులు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు చెక్క వెంకటేష్ మాట్లాడుతూ.. కొలనుపాక గ్రామంలోని సర్వే నంబర్ 8లో ఉన్న 2 ఎకరాల 20 గుంటల ప్రభుత్వ భూమిని ఇళ్లు లేని నిరుపేదలకు పంపిణీ చేయాలని రెండున్నరేళ్లుగా పోరాటం చేస్తున్నామని తెలిపారు. ఈ సమస్యపై స్థానిక ఎమ్మెల్యేతో పాటు జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తహశీల్దార్ తదితర అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు అందజేసినా ఇప్పటివరకు ఎలాంటి పరిష్కారం చూపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు.

ఎన్నికల సమయంలో పేద ఎన్నికల సమయంలో పేదలకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం విస్మరిస్తోందని ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లోనూ అర్హులైన నిరుపేదలకు న్యాయం జరగడం లేదని, తమకు నచ్చిన వారికి కేటాయింపులు చేస్తూ నిజమైన లబ్ధిదారులకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కొలనుపాకలోని ప్రభుత్వ భూమిని అర్హులైన పేదలకు ఇంటి స్థలాలుగా కేటాయించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రానున్న రోజుల్లో ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పేదల హక్కుల సాధన కోసం సీపీఐ నిరంతరం అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి చౌడబోయిన కనకయ్య, మండల కార్యవర్గ సభ్యుడు కందుల మధు, జిల్లా ప్రజానాట్యమండలి ఉపాధ్యక్షుడు పోతు ప్రవీణ్, భూపోరాట కమిటీ సభ్యులు మోతె భవాని, సంధ్య, సుశీల, మౌనిక, జాంగిర్ బీ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్