Magazines

సీఈఐఆర్ ద్వారా మొబైల్ రికవరీ

1 గంట క్రితం

CEIR
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 18, 2026 | 1 నిమిషాల చదవడం

- బాధితుడికి ఫోన్‌ను తిరిగి అందజేసిన అశ్వారావుపేట పోలీసులు

నవతెలంగాణ - అశ్వారావుపేట

పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌ను సీఈఐఆర్ పోర్టల్ ద్వారా రికవరీ చేసి బాధితుడికి తిరిగి అందజేసినట్లు అశ్వారావుపేట ఎస్ హెచ్ ఓ సాయి కిశోర్ రెడ్డి తెలిపారు. ఈ నెల 11వ తేదీన అశ్వారావుపేటలోని నెహ్రూనగర్‌కు చెందిన నామినేని రాజేష్‌ (తండ్రి వెంకటేష్) తన మొబైల్ ఫోన్‌ను పోగొట్టుకున్నాడు.


దీంతో ఆయన పోలీసులను సంప్రదించగా, పోలీసులు సీఈఐఆర్ పోర్టల్ ద్వారా మొబైల్ ఫోన్‌ను గుర్తించి రికవరీ చేశారు. అనంతరం ఆదివారం బాధితుడికి ఫోన్‌ను తిరిగి అందజేశారు. పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను గుర్తించేందుకు సీఈఐఆర్ పోర్టల్ ఉపయోగపడుతుందని, మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నవారు పోలీసులను సంప్రదించి తగిన వివరాలతో ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్