నవతెలంగాణ - అశ్వారావుపేట
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అశ్వారావుపేట పోలీసులు సూచించారు. మండల పరిధిలో ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ, ఆన్లైన్ మోసాలు, ఓటీపీ మోసాలు, నకిలీ లింకులు, యూపీఐ లావాదేవీల మోసాలు, సోషల్ మీడియా మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.
ఎవరితోనూ ఓటీపీ, ఏటీఎం పిన్, యూపీఐ పిన్, బ్యాంకు ఖాతా వివరాలను పంచుకోవద్దని సూచించారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని, మోసపూరిత ఫోన్ కాల్స్, సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. సైబర్ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయాలని లేదా [www.cybercrime.gov.in](https://www.cybercrime.gov.in) వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని అశ్వారావుపేట అదనపు ఎస్సై జే. దేవ్‌సింగ్ సూచించారు. ప్రజలు సైబర్ నేరాలపై అవగాహన పెంచుకుని, అప్రమత్తతతో తమ ఆర్థిక లావాదేవీలు నిర్వహించాలని కోరారు.







కామెంట్లు (0)