Magazines

తరోడ సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు

1 గంట క్రితం

Accident
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 30, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - ముధోల్
మండలంలోని బైంసా-బాసర ప్రధాన రహదారిపై తరోడ గ్రామ సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ముధోల్ ఎస్సై బిట్ల పెర్సిస్ కథనం ప్రకారం.. చించాల గ్రామానికి చెందిన దుడ్డు రాజన్న, ఎడ్ బిడ్ గ్రామానికి చెందిన డి.పోశెట్టి బైక్‌పై బైంసా నుంచి ముధోల్ వైపు వస్తుండగా, తరోడ నుంచి బైంసా వైపు వెళ్తున్న ట్రాక్టర్ ఎదురెదురుగా ఢీకొంది.


ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించడంతో క్షతగాత్రులను బైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న చించాల ఉపసర్పంచ్ పీసర సాయినాథ్ గౌడ్ హుటాహుటిన ఆస్పత్రికి చేరుకుని వైద్యులతో మాట్లాడారు. దుడ్డు రాజన్న పరిస్థితి దృష్ట్యా అంబులెన్స్ ఏర్పాటు చేయించి మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్‌కు తగిలించారు. డి.పోశెట్టి బైంసా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాద స్థలాన్ని ఎస్సై పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్