Magazines

విదేశీ మారక నిల్వలు మరింత ఆవిరి..

1 గంట క్రితం

Foreign
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 24, 2026 | 1 నిమిషాల చదవడం

ఆరు వారాల్లో 64.69 బిలియన్ డాలర్ల పతనం

ముంబయి : భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలు వరుసగా క్షీణిస్తున్నాయి. అక్టోబర్ 16తో ముగిసిన వారంలో మరో 5 బిలియన్ డాలర్లు తగ్గి 721.02 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. అంతకుముందు వారంలోనూ 8.58 బిలియన్ డాలర్లు తగ్గి 726.03 బిలియన్ డాలర్లకు చేరాయి. సెప్టెంబర్ 4తో ముగిసిన వారంలో రికార్డు స్థాయిలో 785.71 బిలియన్ డాలర్లకు చేరిన నిల్వలు కేవలం ఆరు వారాల్లోనే 64.69 బిలియన్ డాలర్లు (సుమారు 8.2 శాతం) ఆవిరయ్యాయి. శుక్రవారం ఆర్‌‌బీఐ విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయం వెల్లడయ్యింది. రూపాయి విలువ పతనాన్ని అడ్డుకునేందుకు ఆర్‌బీఐ మార్కెట్లో డాలర్లను విక్రయించడం, విదేశీ కరెన్సీ నాన్ రెసిడెంట్ బ్యాంక్ డిపాజిట్ల (ఎఫ్‌సీఎన్‌ఆర్-బీ) వనరుల వినియోగం విదేశీ మారక నిల్వల క్షీణతకు ప్రధాన కారణాలని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

సెప్టెంబర్ తొలి వారంలో ప్రవాస భారతీయుల డిపాజిట్లకు సంబంధించిన ప్రత్యేక రాయితీ స్వాప్ పథకం ద్వారా భారీగా విదేశీ నిధులు రావడంతో నిల్వలు గరిష్ఠ స్థాయికి చేరాయి. అయితే ఆ తర్వాత నుంచి వరుసగా తగ్గుముఖం పట్టాయి. తాజా వారంలో విదేశీ మారక నిల్వల్లో ప్రధాన భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు 5.76 బిలియన్ డాలర్లు తగ్గి 591.85 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. మరోవైపు బంగారం నిల్వల విలువ 706 మిలియన్ డాలర్లు పెరిగి 105.80 బిలియన్ డాలర్లకు చేరింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థకు సంబంధించిన స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్‌డిఆర్‌లు) 30 మిలియన్ డాలర్లు పెరిగి 18.58 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. బంగారం నిల్వల విలువ పెరిగినప్పటికీ విదేశీ కరెన్సీ ఆస్తుల్లో భారీ తగ్గుదల మొత్తం నిల్వలపై ప్రతికూల ప్రభావం చూపింది.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్