Magazines

వినూత్న ప్రయోగం

49 నిమిషాల క్రితం

Innovative experiment
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 31, 2026 | 1 నిమిషాల చదవడం

సినిమా థియేటర్‌లో చూసే అనుభూతిని అవుట్‌ డోర్‌‌లోనూ ప్రేక్షకులకు అందించాలనే వినూత్న ఆలోచనతో ‘ఓ నా సిద్ధయ్య’ టీమ్ సరికొత్త సంచలనానికి తెరలేపింది. భారతదేశంలోనే తొలిసారిగా అవుట్‌డోర్ వేదికపై 70ఎంఎం భారీ స్క్రీన్‌తో పాటు డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసి ఈ ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్‌ను అత్యంత వైభవంగా విడుదల చేసింది. ఇటీవల హైదరాబాద్‌లోని శంషాబాద్ ప్రభుత్వ కళాశాల, పాఠశాల మైదానంలో జరిగిన ఈ వేడుకకు 5 వేల మందికి పైగా ప్రేక్షకులు హాజరయ్యారు. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ ప్రేక్షకుల ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. భార్యా భర్తల ప్రేమానుబంధానికి ప్రతిరూపం ‘ఓ నా సిద్ధయ్య’ ఆల్బమ్‌. ఈ ఈవెంట్‌కు నటుడు సోనూసూద్ ముఖ్య అతిథిగా హాజరై

‘ఓ నా సిద్ధయ్య’ పాటను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,‘ ఓపెన్ ప్లేస్‌లో 70ఎంఎం భారీ స్క్రీన్‌పై పాటను విడుదల చేయడం ఎంతో సంతోషంగా ఉంది. ఇలాంటి వినూత్న ప్రయత్నం చేసిన చిత్రటీమ్‌ను అభినందిస్తూ, పాట మంచి విజయం సాధించాలని ఆకాంక్ష‍ిస్తున్నాను’ అని తెలిపారు.. మరో ముఖ్య అతిథిగా హాజరైన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ,‘‘ఓ నా సిద్ధయ్య’ పాట ప్రేక్షకుల ఆదరణ పొందడంతో పాటు పెద్ద విజయం సాధించాలి’ అని అన్నారు. ఈ వేడుకకు హీరో ఇంద్రరామ్, సింగర్ నల్గొండ గద్దర్ నరసన్న, గాయకుడు, మ్యూజిక్ డైరెక్టర్ బోలే షావలి, నటుడు ఉత్తేజ్‌ హాజరయ్యారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్