Magazines

మనసుని చూడాలనివుంది

1 గంట క్రితం

I want to see the heart.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 01, 2026 | 1 నిమిషాల చదవడం


హృదయంలో ఉన్న మనసుని

చూడాలని ఉంది.

ఒక్కోసారి అది అలల్లా ఎగసిపడుతుంది.

రాజేసిన నిప్పుల కుంపటిలా మండుతుంది.

ఇంకోసారి మంచుకురిసిన చల్లని

హిమపాతంలా మారుతుంది.

మరోసారి వానలా మారి....

తుఫానులా వరదలు పొంగిస్తుంది.

సుడిగుండాల్లాంటి కష్టాల కడలిలో చిక్కుకున్న..

రోదనలు అన్నీ ఎగసిపడుతున్న...

మబ్బులన్ని నన్ను చుట్టేసిన..

చీకటి తెరలన్నీ నాలో విస్తరించిన...

కన్నీరంత కుండకు పొడిచిన చిళ్ళై కారుతున్న..

నా మనసుమాత్రం..

నా ఎదలోపల విజయపు జెండా ఎత్తుకొని

నన్ను విజయతీరాల వైపు నడిపిస్తుంది.

నింగి శిఖరాల్లో మెరిచే తారలై వెలుగునిస్తుంది..

సంకటాల తుఫానులో గొడుగై నిలుస్తుంది.

నా మనసేపుడు నా వెంటే ఉంటుంది నీడలా.

నేను ఎప్పుడూ నడుస్తుంటాను...

మడమతిప్పని వీరుడిలా.

ఎత్తైన కొండపై నుండి జారిపడుతున్న జలపాతంలా.

దూదిపింజల్లాంటి తెల్లని ప్రేమ పొగులతో

ప్రేమానుబంధాలు అనే అల్లికలను అల్లుతుంది.

ఆకాశంలో మొలిచిన ఇంద్రధనస్సు వర్ణాలై

అందమైన రంగుల ప్రపంచాన్ని చూపిస్తుంది.

అది కనిపించని గాలిపొర.

ఎండిపోతున్న బతుకునుతడిపే జలదార.

మహా సముద్రంలాంటి దుఃఖాన్ని దాచుకుంటుంది.

ఎల్లలు దాటి ప్రపంచాన్ని చూస్తుంది.

ఒక మహా యజ్ఞాన్ని తలపెట్టి

జీవితాన్ని ఉన్నతశిఖరాలపైపు తీసుకెళ్తుంది.

అందుకే మనసుని చూడాలని ఉంది...!

అది చూపించే మంచి దారిలో నడవాలనుంది.

అశోక్ గోనె, 9441317361

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్