నా జీవితంలో
ఏ రాత్రి
కలకు భయపడనక్కరలేదు
నా కళ్లను వాటేసుకున్న
పడక నిద్ర సంగతి
చూసుకుంటుంది.
రాత్రి నా పక్కలో
ఎంత సేపు ఉంటుందో
తెలియదు...
ఏ కలతో
అతిగా మెలిగి
రాత్రికి ద్రోహం చేయలేను
ఏ రాత్రికి
నా జీవితంలో
భయం లేదు
ఏ కల
అక్రమ ఆనందం
నాకు అక్కరలేదు.
చందలూరి నారాయణరావు, 9704437247







కామెంట్‌లు (0)