Magazines

ఊరూ వాడా కదులుతోంది

2 గంటల క్రితం

community
avatar
balaji

ప్రచురించబడింది నవం 13, 2026 | 1 నిమిషాల చదవడం

రైతు మహాసభలకు సమరోత్సాహం

15న బహిరంగసభకు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు, ఇతర వాహనాల్లో వచ్చేందుకు సిద్ధమైన అన్నదాతలు


నవతెలంగాణ–ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
నల్లగొండలో జరగనున్న తెలంగాణ రైతు సంఘం జాతీయ మహాసభలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా సమాయత్తమవుతోంది. ఉరూవాడా కదలడానికి సిద్ధమైంది. గ్రామగ్రామాన ఎర్రజెండాలు, గోడరాతలు, పోస్టర్లు, ప్రచార కార్యక్రమాలతో పల్లెలు ఉద్యమ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. రెండు వేల మంది రెడ్‌షర్ట్ వాలంటీర్లు, 15 వేల మందికిపైగా రైతులు, వ్యవసాయ కార్మికులు మహాసభలకు తరలివెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. 300కుపైగా బస్సులు, ఇతర వాహనాల్లో 15న జరిగే బహిరంగసభ కోసం నల్లగొండకు చేరుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మహిళలు, యువత, కార్మికులు సైతం ప్రచారంలో చురుగ్గా పాల్గొంటుండటంతో మహాసభల సందడి ఉమ్మడి జిల్లాలో పతాక స్థాయికి చేరింది.

పోరాటాలకు పురిటిగడ్డగా పేరొందిన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తెలంగాణ రైతు సంఘం జాతీయ మహాసభల ప్రచారం జోరుగా సాగుతోంది. స్థానిక సభలు, సదస్సుల ద్వారా వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సంక్షోభం, ప్రభుత్వ విధానాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లా నుంచి తరలివెళ్లనున్న రెండు వేల మంది రెడ్‌షర్ట్ వాలంటీర్లలో 400 మంది మహిళలు ఉన్నారు. గ్రామాల వారీగా రైతులు చందాలు సేకరించి ప్రయాణ ఖర్చులను సమకూర్చుకుంటున్నారు. ట్రాక్టర్లు, బస్సులు, ఇతర వాహనాలను ఏర్పాటు చేస్తున్నారు. అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) 36వ జాతీయ మహాసభల సందర్భంగా నవంబర్ 15న నల్లగొండలో నిర్వహించే భారీ ప్రదర్శన, బహిరంగ సభకు రైతులు, కార్మికులు, ప్రజలు లక్షలాదిగా తరలిరావాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు నున్నా నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి యర్రా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్